Allu Arjun: చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన తన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు అనే టాక్ ఉంది. నలుగురికి సాయం చేయాలి అనే గుణం కలిగిన గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేసి ఆయనను కూడా టాప్ పొడ్రూసర్ గా మార్చారు అని అంటారు కొందరు.
పవన్ కళ్యాణ్ కు సినిమాలపై ఆసక్తి లేకున్నా ఇండస్ట్రీలోకి తీసుకొని వచ్చి ఆయనకు మంచి లైఫ్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. అయితే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ను మొదటగా ఇండస్ట్రీకి తీసుకువచ్చింది కూడా చిరంజీవి అని సమాచారం. అయితే ఆర్య సినిమా విషయంలో అల్లు అరవింద్ కొంచెం మొండిగా వ్యవహరించారట. కానీ ఈ సినిమాను దగ్గరుండి మరీ పట్టాలెక్కించారట మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా సూపర హిట్ ను సొంతం చేసుకోవడంతో అల్లు అర్జున్ కు తిరుగులేకుండా పోయింది.
చిరంజీవి అల్లు అర్జున్ ను హీరోగా చేస్తే.. ఆయనను స్టార్ గా నిలబెట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ అంటారు కొందరు. బన్నీ ప్రతి సినిమా ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అటెండ్ అయి ఆ సినిమాకు ప్రమోషన్స్ చేస్తూ సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించేవారట. పూరి జగన్నాద్ లాంటి డైరెక్టర్ తో చెప్పి దేశముదురు లాంటి సినిమాను కూడా అల్లు అర్జున్ తో తెరకెక్కించేలా మాట్లాడారట. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో మాట్లాడి జులాయి సినిమా ఆఫర్ ను అల్లు అర్జున్ కు వచ్చేలా చేశారట పవన్ కళ్యాణ్.
ఇలా బన్నీ కెరీర్ స్టార్ గా నిలబడేలా చాలా ప్రయత్నాలు చేశారట పవన్ కళ్యాణ్. మొత్తం మీద ఇద్దరు మెగా బ్రదర్స్ కూడా బన్నీ కెరీర్ కోసం చాలా కష్టపడ్డారు అనే టాక్ ఉంది. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.