Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: అర్జున్, అమర్ లు సేఫ్ గేమ్ ఆడుతున్నారా? శివాజీ అంటే...

Bigg Boss 7 Telugu: అర్జున్, అమర్ లు సేఫ్ గేమ్ ఆడుతున్నారా? శివాజీ అంటే భయమా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇల్లు అంటేనే గుర్తు వచ్చేది గొడవలు, ప్రేమలు, టాస్కులు. వీటితో పాటు మరీ ముఖ్యంగా భూతులు కూడా వినిపిస్తాయి. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చెప్పడం కష్టమే. ప్రేక్షకులు చూస్తున్నారు అని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇక ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లో కూడా అదే జరుగుతుంది. ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా భోలే శవాలీ వచ్చినప్పటి నుంచి ఈ భూతుపురాణం మరీ తారా స్థాయికి చేరుకుంది.ఈయనకు తోడు శివాజీ ఉండడంతో ఇది మరింత ముదిరిందనే చెప్పాలి.

అయితే రీసెంట్ గా స్టార్ మా సీరియల్ బ్యాచ్ మీద ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారో అంటారు. కానీ అందరిని ప్రభావితం చేసేది మాత్రం శివాజీ అనే టాక్ వినిపిస్తుంది. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరిని తన గ్రూప్ లోకి తీసుకొని స్టార్ మా బ్యాచ్ మీద నెగటివిటీ పెంచాలని చూస్తున్నారనే టాక్ మూటగట్టుకున్నాడు శివాజి. శివాజీ అర్జున్ అయితే గట్టి పోటీ ఇవ్వగలడు అనే చర్చ సాగుతుంది. కానీ ఎందుకో ఈయన కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటి వరకు శివాజీ తో ఆయనకీ ఎలాంటి సమస్య రాలేదు. పైగా శివాజీ తో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుతుంటాడు.అర్జునే శివాజీ కి పోటీ అవుతాడని అందరూ అనుకుంటుంటే, ఇతను కూడా శివాజీ భజన బృందం లో చేరిపోతాడేమో అని ఆడియన్స్ కి అనిపిస్తుందట. మరోపక్క శివాజీ అమర్ దీప్ ను తిట్టినా కూడా రియాక్ట్ అవడు. అయితే నీ ఆటని చూస్తే జనాలు నవ్వుతారని..తాను చనిపోయే ముందైనా కూడా ఈయనను నమ్మద్దని తన పిల్లలకు చెబుతానని కించపరిచాడు శివాజీ. అయినా కూడా అమర్ దీప్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.

ఇలా అర్జున్, అమర్ అందరూ కూడా గొడవలకు దూరంగా ఉంటూ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ ను సొంతం చేసుకుంటున్నారు. కానీ కరెక్ట్ గా ఆడితే వీళ్లు టాప్ 5లో ఉండడం పక్కా అనే టాక్ కూడా ఉంది. మరి చూడాలి ఎవరు టాప్ 5లో నిలుస్తారో? ఎవరు విన్నర్ అవుతారో?

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular