https://oktelugu.com/

AR Rahman’s divorce case : ఏఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారంపై మనస్తాపానికి గురైన కొడుకు..చూస్తుంటే బాధగా ఉందంటూ ఎమోషనల్ కామెంట్స్!

రెహమాన్, సైరా భాను మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయి ఉండొచ్చని, ఇలా ఎవరికి తోచిన కథలు వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ చూసి తీవ్రమైన మనస్తాపానికి గురైన రెహమాన్ కుమారుడు అమీన్ చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 09:33 PM IST

    AR Rahman son Amen

    Follow us on

    AR Rahman’s divorce case : ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్, తన భార్య సైరా భాను తో విడిపోతున్నట్టు ఇటీవలే సోషల్ మీడియా లో అభిమానులకు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ’29 ఏళ్ళ మా ఇద్దరి దాంపత్య జీవితం, 30వ ఏటలోకి అడుగుపెట్టబోతుందని ఎంతో సంతోషించాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము’ అంటూ తన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో ప్రకటించాడు రెహమాన్. ఈ పోస్టులు తెగ వైరల్ గా మారాయి. వీళ్లిద్దరి విడాకుల పట్ల అభిమానుల నుండి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రెహమాన్ ఈ విషయాన్ని ప్రకటించిన రోజే, రెహమాన్ టీం లో పని చేసే మోహినీదే అని అమ్మాయి కూడా తన భర్త తో విడాకులు తీసుకుంటున్నట్టు ఇంస్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది.

    ఇలా ఒకేసారి ఇద్దరు తమ వైవాహిక జీవితాలకు ముగింపు పలకడంతో, రెహమాన్ మోహినీదే ని పెళ్లి చేసుకోబోతున్నాడని, వీళ్లిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ కారణంగానే రెహమాన్, సైరా భాను మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయి ఉండొచ్చని, ఇలా ఎవరికి తోచిన కథలు వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ చూసి తీవ్రమైన మనస్తాపానికి గురైన రెహమాన్ కుమారుడు అమీన్ చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘నా తండ్రి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి కూడా. ఒక లెజెండ్ గా కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందిన ఉత్తమమైన వ్యక్తి ఆయన. అలాంటి లెజెండ్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్న కథనాలు చూసి చాలా మనస్తాపానికి గురయ్యాను. ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడే ముందు, నిజం విలువ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇలాంటి అసత్య కథనాలు ఇప్పటి నుండైనా ఆపండి’ అంటూ చాలా ఎమోషనల్ గా ట్విట్టర్ లో స్పందించాడు.

    మరోపక్క నెటిజెన్స్ ఏఆర్ రెహమాన్ విడాకుల విషయంలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పెళ్ళికి ఎదిగిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని, దాదాపుగా మూడు దశాబ్దాల బంధంకి ముగింపుని ఎలా తెలపగలరు?, అసలు ఎలా మనసు వస్తుంది. అన్ని ఏళ్ళు కలిసి జీవించిన వీళ్లిద్దరి మధ్య ఇన్నాళ్లు ఎలాంటి గొడవలు రాకుండా ఉన్నాయా?, ఇప్పుడొచ్చిన గొడవ అప్పటి కంటే పెద్దవా?, అసలు ఇలాంటోళ్లకు ఈమధ్య కాలం లో ఏమి అవుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక రెహమాన్ సినిమాల విషయానికి ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు కమల్ హాసన్, మణిరణం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ది తగ్ లైఫ్’ అనే చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.