AP Power Cuts: ఏపీలో కరెంట్ కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో కోతలు అనివార్యమయ్యాయి. మరోవైపు ఎండలు ముదురుతుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. వ్యవసాయం పంపు సెట్లకు కూడా తగినంతగా విద్యుత్ సరఫరా కావడం లేదు. పేరుకే ఉచిత విద్యుత్ కానీ.. ఏకధాటిగా గంటపాడు విద్యుత్ సరఫా చేయలేకపోతున్నారు. అటు చాలీచాలని విద్యుత్ ఉత్పత్తి, ఇటు మితిమీరిన వినియోగంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కనీస స్థాయికి పడిపోయింది. బొగ్గు సరఫరా లేని కారణంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం ముందస్తుగా పవర్ హాలీ డే ప్రకటించినా.. ఏ మంత ప్రయోజనం లేకపోతోంది. పరిశ్రమలకు నిలిపివేసిన విద్యుత్ ను గ్రుహ అవసరాలకు వినియోగిస్తున్నారు. గ్రుహాలకు కోతలు లేకుండా అందిస్తున్నారు. విద్యుత్ ను పొదుపువాడుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలను సూచించాయి. కానీ చాలా మంది విన్నపాన్ని పాటించడం లేదు. ఇళ్లో ఇష్టారాజ్యంగా ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్ లు వినియోగిస్తున్నారు. దీంతో ఇళ్లకు వాడే విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన కారణంగా రోజుకు 20 మిలియన్ యూనిట్లు ఆదా అవుతోంది.
రోడ్డుపైకి వస్తున్న ప్రజలు
రాష్ట్ర వ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేళాపాలా లేకుండా సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు రహదారులపైకి వస్తున్నారు. సబ్ స్టేషన్లు చుట్టుముడుతున్నారు. ప్రస్తుతం రబీలో భాగంగా కూరగాయలు, చిరు ధాన్యాలు, ఇతరత్రా పంటలు వేసుకున్నారు. రెండో పంటలో భాగంగా వరి సాగు చేస్తున్నారు. దాదాపు రైతులు పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టేశారు. చివరిగా పంట పక్వానికి వచ్చే సమయమిది. చివరి తడులు అందించాల్సిన సమమంలో విద్యుత్ కోతలతో మోటార్లు పనిచేయడం లేదు. మరోవైపు ఎండలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
Also Read: Raveena Tandon: గ్రేట్.. ఈ స్టార్ హీరోయిన్ ఆ పనులు కూడా చేసింది !
గంట కూడా ఏకధాటిగా బోరు పనిచేయని పరిస్థితి. తరచూ మోటారుకు పవర్ సప్లయ్ నిలిపివేస్తుండడంతో రోజుకు 20 సెంట్లు పొలం కూడా తడవని దుస్థితి. ఈ పరిస్థితుల్లో చివరి తడుపుకైనా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. చివరకు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అభ్యర్థించే స్థితికి వచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు
దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత గణనీయంగా పెరిగింది. తొలుత ఏపీ పరిశ్రమలకు పవర్ హాలీ డే ప్రకటించింది. మరో వారం రోజుల పాటు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కూడా పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాయి. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మనకు మామూలుగా బొగ్గు రష్యా ఉక్రెయిన్ నుండి వస్తుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా బొగ్గు ఆగిపోయింది.ఆస్ట్రేలియా ఇండోనేషియాలు బొగ్గు ధరలను విపరీతంగా పెంచేశాయి. ఎంత ధరపెట్టినా కొందామని కేంద్రం ఎంత ప్రయత్నం చేస్తున్నా బొగ్గు దొరకటం లేదు. దీనివల్ల దేశంలోని చాలా రాష్ట్రాలు కరెంటు కష్టాలను ఎదుర్కోక తప్పటం లేదు.గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా పవర్ హాలిడే ప్రకటించేశాయి. ఢిల్లీ తమిళనాడు కర్నాటక మహారాష్ట్ర తెలంగాణా కేరళ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా కరెంటు ఉత్పత్తి బాగా తగ్గిపోవటంతో కోతలు తప్పటం లేదు. మరీ సమస్య ఎప్పుడు తీరుతుందో ఏమో.
Also Read:Bigg Boss Telugu OTT: వెన్నుపోటు అలకరాజా: బిందుమాధవిపై నెగ్గేందుకు అఖిల్ చేస్తున్న పెద్ద స్కెచ్ ఇదే
Recommended Videos: