https://oktelugu.com/

game changer vs daku maharaj : గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్యా సినిమా ‘డాకు మహారాజ్’ కు రేట్లు పెంచిన బాబు గారు.. ఎంతంటే..?

నందమూరి నట సింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కంటు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఈ ఏజ్ లో యంగ్ హీరోలకు పోటీ ని ఇస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : January 5, 2025 / 12:27 PM IST

    Game Changer Daku Maharaj

    Follow us on

    game changer vs daku maharaj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళ స్టార్ డమ్ ని వాడుకుంటూ అంచలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారి దగ్గర నుంచి నందమూరి ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి వాళ్ళందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలయ్య బాబు మొదటి నుంచి కూడా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన ఎన్నో గొప్ప సినిమాలను చేసినప్పటికి ఇప్పుడు సంక్రాంతికి ‘డాకు మహారాజు’ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు చాలా అరుదైన గౌరవం అయితే ఉంది. సీనియర్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఈ ఏజ్ లో కూడా ఆయన చాలా బాగా డాన్స్ చేస్తూ ఫైట్లు చేస్తూ యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు.

    ఇక ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకున్న ఆయన ఈ విజయంతో నాలుగో సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే ఏపీ గవర్నమెంట్ ‘డాకు మహారాజ్’ సినిమాకి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ అయితే ఇచ్చింది. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పొద్దున నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షో లకు పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇక జనవరి 12 నుంచి 25 వరకు డైలీ 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది…

    దాంతో పాటుగా టికెట్ రేటు కూడా పెంచుకోవడానికి అవకాశమైతే కల్పించింది. ఇక బెనిఫిట్ షో కి 500 రూపాయల టికెట్ రేట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక మల్టీప్లెక్స్ లో 135 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 110 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది…

    ఇక ఏది ఏమైనా కూడా ఏపీ సిఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఇటు ‘గేమ్ చేంజర్’ సినిమాకి హైక్ ఇవ్వడంతో పాటుగా తన బామ్మర్ది అయిన బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాకి కూడా బాబు గారు బెనిఫిట్ షో లకు అనుమతినిస్తూ టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది…