Bunny Vasu : బన్నీ వాసు.. ఇప్పుడు ‘అల్లు’ ఫ్యామిలీకే కాదు. మెగా ఫ్యామిలీకి కూడా ‘ఆప్తు’డయ్యాడు. అల్లు కుటుంబానికి అన్నీ తానై వ్యవహారాలు చక్కబెడుతున్న ఈ నిర్మాత ఇప్పుడు మెగా ఫ్యామిలీతోనూ తన అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం టాలీవుడ్ సినీ వర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది.. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు అల్లు-మెగా కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయనే పుకార్లను లేవనెత్తాయి. అయితే మెగా-అల్లు కుటుంబాల మధ్య గొడవలు కేవలం కొందరు సృష్టించిన అపోహలు మాత్రమే. ఎలాంటి మనస్పర్థలు లేవని తాజా ఘటనలు తెలియజేస్తున్నాయి. లైలా మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో చిరంజీవి నోట అల్లు అర్జున్ పేరు వినిపించింది. ఆయన ప్రసంగంలో పుష్ప మూవీ ప్రస్తావన వచ్చింది.
తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ లకి అత్యంత సన్నిహితుడు. గీతా ఆర్ట్స్ క్యాంపుకి చెందిన నిర్మాత బన్నీ వాసుకి మెగా ఫ్యామిలీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు మెగా ఫ్యామిలీ కలిసి కట్టుగా పని చేస్తుంది. కాగా బన్నీ వాసుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన ఆవిర్భావ సభ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇంచార్జ్ గా నియమించారు. ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు మెగా క్యాంపులో అత్యంత కీలకంగా మారినట్లు ఈ పరిణామం సూచిస్తుంది. రెండు కుటుంబాలతో సాన్నిహిత్యం ఉన్న బన్నీ వాసు ఒక వారధిగా వ్యవహరిస్తున్నారన్న భావన కలుగుతుంది. బన్నీ వాసు మొదటి నుండి మెగా అభిమాని. అల్లు అర్జున్ కోసం పని చేస్తూనే మెగా హీరోలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా కూడా మెగా ఫ్యామిలీతో ఆయన ప్రయాణం సాగుతుంది.
మెగా-అల్లు కుటుంబాలు తనకు అప్పగించిన పనులు విజయవంతంగా నెరవేరుస్తూ, వారి విశ్వాసాన్ని బన్నీ వాసు చూరగొన్నారు. అల్లు అర్జున్ సక్సెస్ లో కూడా బన్నీ వాసు పాత్ర ఉంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కి బెస్ట్ పీఆర్ టీమ్ బన్నీ వాసు రూపంలో ఆయనకు దొరికింది.
మరోవైపు గీతా ఆర్ట్స్, జీ2 ఆర్ట్స్ బ్యానర్ లో సక్సెస్ఫుల్ చిత్రాలు బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవల తండేల్ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్నారు. బన్నీ వాసు లేకపోతే నేను లేను అని అల్లు అరవింద్ అంటారు. బన్నీ వాసును ఒక కుటుంబ సభ్యుడిగా అల్లు ఫ్యామిలీ భావిస్తుంది. అదే విశ్వసనీయత చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల నుండి బన్నీ వాసుకి దక్కుతుంది. 2024 ఎన్నికల్లో జనసేన విజయం కోసం బన్నీ వాసు ఒక కార్యకర్తగా తన వంతు పనిచేశారు. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ అప్పగించిన బాధ్యతను కూడా భుజానకెత్తుకొని ముందుకు సాగుతున్నారు. మొత్తంగా బన్నీ వాసు మెగా-అల్లు క్యాంపుల్లో కీలక వ్యక్తిగా మారాడని ఈ పరిణామాలను బట్టి చెప్పొచ్చు.