https://oktelugu.com/

CM Jagan: టాలీవుడ్ విశాఖకు రావాల్సిందే.. జగన్ కోరిక అదే

CM Jagan: టాలీవుడ్ పెద్దలతో జరిగిన భేటిలో జగన్ కోరిక కుండబద్దలు కొట్టారు. మీకు ఇళ్ల స్థలాలిస్తాను.. స్టూడియోలు కట్టుకోవడానికి ఎకరాలకు ఎకరాలు ఇస్తాను.. కానీ హైదరాబాద్ వదిలి విశాఖపట్నం వచ్చి ఇక్కడికి టాలీవుడ్ ను తరలించండి అని జగన్ కోరిక కోరారు. ఏపీ మంత్రి పేర్ని నాని సైతం అదే మాట చెప్పారు. తెలంగాణలో ఉంటూ షూటింగులు అక్కడే పెట్టుకొని అక్కడే ఉంటున్న సినీ పెద్దలను ఏపీలో షూటింగ్ లకు రావాలని కోరారు. దీన్ని ఏపీ ప్రభుత్వం, […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2022 / 06:54 PM IST
    Follow us on

    CM Jagan: టాలీవుడ్ పెద్దలతో జరిగిన భేటిలో జగన్ కోరిక కుండబద్దలు కొట్టారు. మీకు ఇళ్ల స్థలాలిస్తాను.. స్టూడియోలు కట్టుకోవడానికి ఎకరాలకు ఎకరాలు ఇస్తాను.. కానీ హైదరాబాద్ వదిలి విశాఖపట్నం వచ్చి ఇక్కడికి టాలీవుడ్ ను తరలించండి అని జగన్ కోరిక కోరారు.

    ఏపీ మంత్రి పేర్ని నాని సైతం అదే మాట చెప్పారు. తెలంగాణలో ఉంటూ షూటింగులు అక్కడే పెట్టుకొని అక్కడే ఉంటున్న సినీ పెద్దలను ఏపీలో షూటింగ్ లకు రావాలని కోరారు. దీన్ని ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ కోరిక ఒక్కటే..

    తెలంగాణలో ఉన్న సినీ పరిశ్రమ ఏపీకి రావాలి. ఇక్కడికి చిత్ర పరిశ్రమను తరలించారు. జూబ్లిహిల్స్ తరహాలో సినీ పెద్దలకు విశాఖపట్నంలో ఒక చోటు ఇస్తానని.. అందరూ వచ్చి ఇక్కడ స్తిరపడితే.. ఏపీ కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీపడుతుందని జగన్ ఆకాంక్షించారు.

    పూర్తి మీటింగ్ సారాంశంలో సినీ పరిశ్రమ కోరికలు తీర్చడానికి జగన్ రెడీగా ఉన్నారు. కానీ ఆయన కోరిక ఏంటంటే ఏపీకి చెందిన ఈ సినీ పెద్దలంతా తెలంగాణలో ఉండడం ఏంటని.. వారంతా హైదరాబాద్ వదిలి విశాఖపట్నం వచ్చి స్వరాష్ట్రంలో సినిమాల షూటింగులు, కార్యకలాపాలు నిర్వహించాలన్నది జగన్ అభిలాష.

    నిజానికి తెలంగాణలో కేవలం 40శాతం మాత్రమే జనాభా.. రెవెన్యూ టాలీవుడ్ కు ఉంది. మిగతా 60 శాతం రెవెన్యూ ఏపీ నుంచే టాలీవుడ్ కు వస్తోంది. ఏపీ జనాలకు సినిమాలంటే పిచ్చి. తెలంగాణ వారితో పోలిస్తే వారే ఎక్కువగా చూస్తారు.అందుకే జగన్ ఈ కోరిక కోరారు. మరి ఇప్పటికే చెన్నై వదిలివచ్చిన టాలీవుడ్ పెద్దలు.. విశాఖపట్నంకు వస్తారా? ఇక్కడ నివసిస్తారా? టాలీవుడ్ ను విశాఖకు తీసుకొస్తారా? అన్నది వేచిచూడాలి.