Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని జగన్ పట్టుదలగా ఉన్నాడు. పవన్ ను దెబ్బ కొట్టాలి అంటే.. మొదట పవన్ ఆర్థిక వనరుల పై దెబ్బ కొట్టాలి. పవన్ కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు ఎప్పుడు ముందు ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పవన్ తో భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే.. రిలీజ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అడ్డమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మాతలు భయపడుతున్నారు.

ఆ మధ్య నిర్మాత అశ్వినీదత్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని బాగా ఉబలాట పడ్డారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ తో సినిమా చేస్తే.. నష్టాలే మిగులుతాయని అశ్వినీదత్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ సినిమా కూడా ఇప్పుడు మరింత ఆలస్యం కానుంది. హరీష్ శంకర్, పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ తన కథలో ఇరికించాడు.
ఈ క్రమంలో పవన్ రాజకీయానికి సంబంధించి కూడా పంచ్ డైలాగ్ లు రాశాడు. ఆ పంచ్ లు జగన్ కి పూర్తి వ్యతిరేకం. అందుకే సినిమా ఇండస్ట్రీలోని జగన్ ప్రభుత్వ మద్దతుదారులు హరీష్ శంకర్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ సలహాలు సూచనలు ఇస్తున్నారట. పవన్ కోసం రాసిన స్క్రిప్ట్ లో రాజకీయాలకు సంబంధించి ఉన్న పంచ్ లను తొలిగించాలని అడుగుతున్నారట.
Also Read: ఇక సదురు చిన్న హీరోగారికి భవిష్యత్తు లేనట్టే !
ఒకవేళ తొలగించని సమయంలో దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తమ్మీద మొదట్లో ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్ మొత్తానికి భయపడ్డాడు. పవన్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై మళ్లీ వర్క్ స్టార్ట్ చేశాడు. హీరోయిజం ఎలిమెంట్స్ ను తన స్క్రిప్ట్ లో తగ్గించే పనిలో పడ్డాడు.
అయితే, పక్కా కమర్షియల్ సినిమాగా ఈ చిత్రాన్ని తీయాలని హరీష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కాకపోతే, తన హీరో సమాజం పై పోరాడే వీరుడు, సూరుడు, ధీరుడు లాంటి బిల్డప్ ఓవర్ డైలాగ్ లను మాత్రం హరీష్ తీసేశాడు. అయినా పవన్ తో ఎలాంటి సినిమా చేయించాలో కూడా జగనే నిర్ణయించడం విశేషమే.
Also Read: ఆ స్టార్ల పరిస్థితి ఏమిటి ? పగకు బలి కావాల్సిందేనా ?