Anushka Shetty Prabhas: అనుష్క శెట్టి బాహుబలి కో స్టార్ ప్రభాస్ కి ఛాలెంజ్ విసిరింది. తన ఛాలెంజ్ స్వీకరించి పూర్తి చేయాలని కోరింది. అనుష్క ఛాలెంజ్ ని ప్రభాస్ అంగీకరించారు. అలాగే సదరు ఛాలెంజ్ పూర్తి చేశాడు. స్టార్స్ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. అనుష్క శెట్టి చాలా గ్యాప్ అనంతరం ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు.
ఈ చిత్ర ప్రమోషన్స్ అనుష్క తనదైన శైలిలో చేస్తుంది. హీరో ప్రభాస్ హెల్ప్ తీసుకుంది. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వంటకాలకు సంబంధించిన రెసిపీ షేర్ చేసింది. అనుష్కకు మంగుళూరు చికెన్, నీర్ దోస అంటే ఇష్టం అంట. ఆ రెండు వంటకాల రెసిపీ ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆహార ప్రియుడు అయిన ప్రభాస్ తన ఇష్టమైన వంటకం ఏమిటో చెప్పి, దాని రెసిపీ, తయారు చేసే విధానం తెలియజేయాలని ఛాలెంజ్ విసిరింది.
అనుష్క ఛాలెంజ్ ని వెంటనే అంగీకరించిన ప్రభాస్ ఫ్యాన్స్ తో తనకు ఇష్టమైన వంటకం ఏమిటో చెప్పారు. అలాగే దాని రెసిపీ షేర్ చేశారు. ప్రభాస్ కి రొయ్యల పులావ్ అంటే మహా ఇష్టం అట. ఆ వంట గురించిన సంగతులు కూలంకషంగా చెప్పేశాడు. అలాగే అనుష్కని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనుష్క నాకు దశాబ్దాలుగా తెలుసు. అయితే తన ఇష్టమైన వంటకాలు ఏమిటో ఇప్పటి వరకూ తెలియదు. ఆమె ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను. అలాగే ఈ ఛాలెంజ్ రామ్ చరణ్ కొనసాగించాలని కోరుకుంటున్నాను… అని పోస్ట్ పెట్టారు.
ఇక రామ్ చరణ్ ప్రభాస్ ఛాలెంజ్ కి ఎలా స్పందిస్తాడో చూడాలి. చరణ్ ఛాలెంజ్ అంగీకరిస్తే ఆయన ఇష్టమైన వంటకం ఏమిటో తెలియనుంది. స్టార్స్ మధ్య సాగిన ఈ సోషల్ మీడియా సంభాషణలు వైరల్ అవుతున్నాయి. అనుష్క మీడియా ముందుకు రాకుండానే తెలివిగా స్టార్స్ తో తన చిత్రానికి ప్రచారం కల్పించుకుంటుంది. మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి చిత్రానికి మహేష్ బాబు పి దర్శకుడు.
View this post on Instagram