Prabhas Sreenu: ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన హావభావాలతో కామెడీ ని పుట్టించగల అతి తక్కువ మంది కమెడియన్స్ లో ఒకరు ప్రభాస్ శ్రీను..ఇతను కేవలం ఇండస్ట్రీ లో కమెడియన్ మాత్రమే కాదు..పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ కి వ్యక్తిగత అసిస్టెంట్ కూడా..ప్రభాస్ కి సంబంధించిన డేట్స్ అన్ని శ్రీను నే చూసుకుంటాడు..ప్రభాస్ వాళ్ళ తనకి గుర్తింపు లభించింది కాబట్టి ఆయన తన స్క్రీన్ నేమ్ ని కూడా ప్రభాస్ శ్రీను గా మార్చేసుకున్నాడు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన కామెడీ ని పండించిన ప్రభాస్ శ్రీను జోరు ఇంతకుముందు తో పోలిస్తే కాస్త తగ్గిందనే చెప్పాలి..ఇటీవలే ప్రభాస్ శ్రీను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..తన సినీ ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు..ముఖ్యంగా ప్రభాస్ తో ఆయనకీ ఉన్న రిలేషన్ గురించి కూడా చెప్పుకొచ్చాడు..వీటితో పాటు ఇండస్ట్రీ లో అతనికి ఎదురైనా చేదు మరియు తీపి జ్ఞాపకాలను కూడా ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడాడు.
ముఖ్యంగా అనుష్క తో తనకి ఎదురైనా ఒక సంఘటన గురించి ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..’అనుష్క నన్ను నమ్మించి మోసం చేసింది’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ కి యాంకర్ సైతం కాసేపు షాక్ లో ఉండిపోయింది..అనుష్క గారు చాలా మంచివారు..అందరితో ఎంతో బాగుంటారు..అలాంటి ఆమె మిమల్ని మోసం చెయ్యడం ఏమిటి అని యాంకర్ అడగగా..!

దానికి ప్రభాస్ శ్రీను సమాధానం చెప్తూ ‘ఒక రోజు లంకావీ లో షూటింగ్ జరుగుతుంది..లంకావీ కి మరియు అనుష్క ఉంటున్న హోటల్ కి మధ్య దూరం దాదాపుగా 30 కిలోమీటర్లు ఉంటుంది..ఏంటండీ అనుష్క గారు బాగా ఆలస్యం అయ్యింది అని అడిగేసరికి అనుష్క గారు ఆ 30 కిలోమీటర్లు మొత్తం సైకిల్ తొక్కుకుంటూ లొకేషన్ కి వచ్చానని..అందుకే ఆలస్యం అయ్యిందని చెప్పింది..వాస్తవానికి ఆమె కారులోనే వచ్చింది..కార్ లో సైకిల్ లో కూడా పెట్టుకుంది..అంత దూరం కార్ లో ప్రయాణించి లొకేషన్ దగ్గరకి వచ్చేలోపు సైకిల్ తొక్కుకుంటూ మా ముందు కనబడింది..అలా అనుష్క అబద్దం చెప్పి నన్ను మోసం చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను.