https://oktelugu.com/

Anushka Shetty Marriage : అనుష్కతో స్టార్ క్రికెటర్ పెళ్లి ఫిక్స్..? ప్రభాస్ పరిస్థితేంటి?

ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని అనుష్క చెబుతూ వచ్చారు. కానీ తాను చెప్పే వరకు ఎవరూ నమ్మొద్దని అన్నారు. అయితే ఈసారి మాత్రం కన్ఫామ్ గా పెళ్లి చేసుకుంటారని, ఆ విషయాన్ని అనుష్క త్వరలో చెబుతారని అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 29, 2024 / 10:29 AM IST

    Anushka Shetty

    Follow us on

    Anushka Shetty Marriage : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ఇలా వచ్చి అలా మాయమైపోతున్నారు. కానీ మొన్నటి తరం వరకు కొందరు హీరోయిన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు సినిమాల్లో కనిపించి అలరించారు. ప్రస్తుతం వాళ్లు సినిమాల్లో కనిపించకపోయినా వారి గురించి నిత్యం చర్చించుకుంటారు. అలా చర్చకు వచ్చే హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి గురించి నిత్యం హాట్ టాపిక్ గా ఉంటుది. ఎందుకుంటే ఈ భామ ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతుందని, ప్రభాస్ తో పెళ్లయితే ఎలా ఉంటుంది? అని మీమ్స్, పిక్స్ సందడి చేశాయి. అయితే వీటిని అనుష్క ఖండించింది. తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఈసారి మాత్రం కన్ఫామ్ అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కన్నడ భామ అనుష్క శెట్టి.. అచ్చ తెలుగు అమ్మాయిలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. మొదట్లో ఈ బ్యూటీని ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రభాస్ తో కలిసి చేసిన ‘మిర్చి’ నుంచి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత మరోసారి ప్రభాస్ తో ‘బాహుబలి’లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అయితే బాహుబలి సినిమా తరువాత అనుష్క బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అనుకున్న అవకాశాలు రాలేదు. దీంతో సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు.

    సినిమాల్లో ఉన్నంతకాలం అనుష్క పెళ్లి టాపిక్ హాట్ హాట్ గా కొనసాగింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా అనుష్క పెళ్లి గురించి చర్చ సాగుతోంది. అనుష్క మొన్నటి వరకు ఓ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ‘భాగమతి’ ఖండించారు. ఆ తరువాత ప్రభాస్ తో పెళ్లి చేసుకోబోతుందని, పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటారని కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు. దీంతో వీరిద్దరు జీవితంలో ఒక్కటవుతారని అనుకున్నారు. అటు ప్రభాస్ సైతం పెళ్లి కి ఆలస్యం చేయడంతో ఈ విషయాలకు మరింత బలం చేకూరింది. కానీ ప్రభాస్, తాను మంచి స్నేహితులమే గానీ పెళ్లి చేసుకోబోమని చెప్పారు.

    అయితే తాజాగా మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అనుష్కతో ఓ స్టార్ క్రికెటర్ జీవితాంతం నడవబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ప్రేమ వ్యవహారం కాకుండా ఇరు కుటుంబాలు మాట్లాడేసుకున్నారని, పెళ్లికి కూడా ఓకే చెప్పారని అంటున్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటానని అనుష్క చెబుతూ వచ్చారు. కానీ తాను చెప్పే వరకు ఎవరూ నమ్మొద్దని అన్నారు. అయితే ఈసారి మాత్రం కన్ఫామ్ గా పెళ్లి చేసుకుంటారని, ఆ విషయాన్ని అనుష్క త్వరలో చెబుతారని అంటున్నారు. మరి హాట్ బ్యూటీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

    అటు ప్రభాస్ పెళ్లిపై కూడా చర్చ సాగుతోంది. ప్రభాస్ సైతం ఏజ్ బార్ అవుతున్నా ఇంకా పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. నిన్నటి వరకు అనుష్క పెళ్లి ప్రభాస్ తోనే జరగుతుందని, అందుకే వారు వెయిట్ చేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు అనుష్క పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ పరిస్థితి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లిపై ప్రభాస్ ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి.