Anushka : రాజమౌళి ఛాన్స్ ఇచ్చినా నో అంది.. బాహుబలిని అనుష్క అందుకే చేసిందట

ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా వాళ్ల కథ నచ్చలేదని ఆర్టిస్ట్ లు చెప్పిన అలా చెప్పుకోడానికి ఇష్టపడరు కానీ అలా చెప్పారు అంటే అందుకే రాజమౌళి గ్రేట్ అనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : November 10, 2023 9:48 pm
Follow us on

Anushka – Bahubali : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ రాజమౌళి కి ఉన్న క్రేజ్ వేరు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మిగిలాయి.ఇక అందులో భాగంగానే ఆయన పాన్ ఇండియా రేంజ్ లో తీసిన బాహుబలి సినిమా ఇండియా వైడ్ గా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక అదే క్రమం లో ఆయన త్రిబుల్ ఆర్ సినిమా చేసి మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించాడు…

అయితే రాజమౌళి ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన చేసిన బాహుబలి సినిమా మాత్రం ఇప్పటికి చాలా స్పెషల్ గానే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీ గా తమన్నా, అనుష్క లు హీరోయిన్లు గా నటించారు. మొదటి పార్ట్ లో తమన్నా కీలక పాత్ర పోషించినప్పటికీ బాహుబలి 2 లో మాత్రం ఆమె పాత్ర అసలు ఎక్కడా కనిపించదు. ఇక రెండో పార్ట్ లో కీలక పాత్ర పోషించిన అనుష్క తనదైన నటనతో ఆ సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అనుష్క గురించి రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఏంటి అంటే అనుష్క కి ఈ సినిమా కథ చెప్పిన తర్వాత ఏమీ ఆలోచించకుండా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పింది అంట దాంతో రాజమౌళి అదేంటి స్టోరీ వినగానే చేద్దాం అని చెప్తున్నవు ఆలోచించుకొని చెప్తా అంటవేమో అని అనుకున్న అని అనగానే అప్పుడు అనుష్క ఈ స్టోరీ నచ్చడం వల్లే నేను ఈ సినిమా చేస్తాను అని చెప్పడం లేదు.షూటింగ్ సెట్ లో నా ఫ్రెండ్స్ అయిన ప్రభాస్, శ్రీవల్లి, రమా అందరూ ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు నేను బయట ఉండి ఏం చేస్తాను.అందుకే సినిమా ఒప్పుకుంటే అందరం ఒకే దగ్గర ఉండి సినిమా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశ్యం తోనే సినిమా ఒప్పుకున్నానని చెప్పింది.

ఇక దాంతో అప్పుడు రాజమౌళి అనుష్క తో నీకు నేను చెప్పిన కథ నచ్చలేదా అని అడిగితే నచ్చిన, నచ్చకపోయినా మా ఫ్రెండ్స్ కోసం సినిమా చేస్తున్నానని చెప్పిందంట ఈ విషయాన్ని రాజమౌళి ఒక ఈవెంట్ లో స్టేజి పైన చెప్పడం నిజంగా రాజమౌళి గ్రేట్ నెస్ కి ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా వాళ్ల కథ నచ్చలేదని ఆర్టిస్ట్ లు చెప్పిన అలా చెప్పుకోడానికి ఇష్టపడరు కానీ అలా చెప్పారు అంటే అందుకే రాజమౌళి గ్రేట్ అనే చెప్పాలి…