Ghaati Movie Twitter Talk: క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం లో అనుష్క(Anushka Shetty) ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటీ'(Ghaati Movie) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. క్రిష్ సినిమా అంటే జనాల్లో మినిమం రేంజ్ ఆసక్తి ఉంటుంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రస్తుతం ఆయన వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కానీ, బ్రాండ్ ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. అందుకే ‘ఘాటీ’ చిత్రం పై అంచనాలు ఒక మోస్తారుగా పెరిగాయి. కానీ అనుకున్నంత అంచనాలు అయితే ఏర్పడలేదు. అందుకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్. కానీ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. ఓవర్సీస్ లో మొదటి షోస్ పూర్తి అయ్యాయి. మరి ట్విట్టర్ జనాలు ఈ సినిమా గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూసేద్దాం పదండి.
#Ghaati An Uninspiring Rustic Action Drama That Lacks Conviction!
Set in the Eastern Ghats, the film revolves around marijuana export. Director Krish attempts to deliver a raw and rustic setup similar to Dasara and Pushpa, but his execution falls flat.
A few sequences in both…
— Venky Reviews (@venkyreviews) September 5, 2025
డైరెక్టర్ క్రిష్ దసరా, పుష్ప తరహాలో రా & రిస్టిక్ గా ఉండేలా ఈ సినిమాని తీర్చి దిద్దడానికి ప్రయత్నం చేసాడట, ఫస్ట్ హాఫ్ లోనూ, సెకండ్ హాఫ్ లోనూ కొన్ని సీన్స్ బాగానే క్లిక్ అయ్యాయి అట. కానీ క్రిష్ మార్క్ స్లో స్క్రీన్ ప్లే న్యారేషన్ మాత్రం చూసే ప్రేక్షకుడికి బోర్ కొట్టించే విధంగా ఉంటాయట. ఈ సినిమాలో మనం ఆశించినంత భారీ హై ఎలివేషన్ సన్నివేశాలు ఉండవట, అదే విధంగా బలమైన స్టోరీ పాయింట్ కూడా ఉండదట. ఓవరాల్ గా ఒక హాఫ్ బేక్డ్ మూవీ లాగా అనిపిస్తాడట. బిలో యావరేజ్ సినిమా అని ట్విట్టర్ జనాలు అంటున్నారు. అనుష్క మాత్రం చాలా బాగా చేసిందట. యాక్షన్ సన్నివేశాలు ఆమె స్టార్ హీరోలతో సమానంగా చేసిందట. సినిమాకు తన నుండి ఏమి కావాలని డైరెక్టర్ అనుకున్నాడో, అంతకు మించే ఇచ్చిందట అనుష్క.
చాలాకాలం తర్వాత జేజమ్మని చూసాం….. చాలా వైవిద్య భరితమైన సినిమా…. యువత వాటికి బానిసలు అవుతున్నారు అంటే దాని వెనుక ఇంత జరుగుతుందా అని అనిపిస్తుంది! @venkyreviews రివ్యూలు చూడకుండా సినిమా చూడండి! #Ghaati pic.twitter.com/OzFuht2kl4
— ๒ђครкคг (@shivsun) September 5, 2025
కేవలం అనుష్క కోసం చూడాలి అనుకున్న వాళ్ళు కచ్చితంగా ఒక్కసారి అయితే ఈ సినిమాని థియేటర్ లో చూడొచ్చు. మరీ తీసి పారేసే రకమైతే కాదు. ఎందుకు డబ్బులు వృధా, ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటే మీ ఇష్టం. కానీ అనేకసార్లు ఓవర్సీస్ ఆడియన్స్ టాక్ నిజం అవ్వలేదు. ఉదాహరణకు కింగ్డమ్ చిత్రాన్ని తీసుకుందాం. ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఇండియా లో షోస్ మొదలయ్యాక నెగటివ్ టాక్ విపరీతంగా వ్యాప్తి చెందింది.ఇదేంటి టాక్ లో ఇంత వ్యత్యాసం అని మనకు అనిపించింది. కాబట్టి ఘాటీ చిత్రం మన ఇండియా లో ఉన్న ఆడియన్స్ కి నచ్చొచ్చు ఏమో చూద్దాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ టాక్ కి సంబంధించి కొన్ని ట్వీట్స్ అందిస్తున్నాము చూడండి.
Telugu360 Final Report : #Ghaati
The second half opens on an emotional note with the backstory of Desi Raju and Sheelavathi. It then shifts into Anushka’s revenge track, which keeps the film engaging for about 45 minutes. Beyond that point, the narrative loses grip and starts…
— Telugu360 (@Telugu360) September 5, 2025
#Ghaati (2.5/5): Routine Revenge Social Drama
Slow start, picked up towards interval, collapses into a draggy 2nd half.
Good BGM and writing tried to pick up, but definitely not a saviour!— Rohit Chowdary (@rohit_chowdary2) September 5, 2025
#Ghaati second half is narrated in #AnushkaShetty character perspective.
Ups and downs are there but #Anushka elevates with her performance
— UKcinetalks (@UKcinetalks) September 4, 2025