https://oktelugu.com/

Anupama Parameswaran : టైట్ గా దుస్తులు వేసుకొని అనుపమా చేసిన అల్లరి చూస్తే సెగలే.. వైరల్ ఫొటోలు

అలాగే రవితేజ ఈగిల్ తో పాటు ఒక తమిళ్, మరొక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అనుపమ కెరీర్ సోసో గా సాగుతుంది. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా అలా చేసుకుంటూ పోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 / 05:35 PM IST
    Follow us on

    Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మిత్రులతో ట్రిప్ కి వెళ్ళింది. తన హ్యాపీ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ టైట్ ఫిట్ లో సూపర్ హాట్ గా కనిపించింది. అమ్మడు గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోమ్లీ బ్యూటీ హాట్ అవతార్ కిక్ ఇచ్చేలా ఉంది. షూటింగ్స్ నుండి విరామం తీసుకున్న అనుపమ అలా విహారానికి వెళ్లారని తెలుస్తుంది. షూటింగ్స్, మీటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే తారలు బ్రేక్ వస్తే అలా నచ్చని ప్రదేశాలకు చెక్కేస్తారు.

    అనుపమ, సాయి పల్లవి ఒకేసారి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మలయాళ చిత్రం ప్రేమమ్ లో వీరిద్దరూ నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఇక తెలుగులో అనుపమ మొదటి చిత్రం అ ఆ. నితిన్-సమంత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో అనుపమ సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. చెప్పాలంటే ఈ మూవీలో అనుపమ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. తెలుగులో నాగ చైతన్య ప్రేమమ్ రీమేక్ లో నటించాడు.

    ఆ మూవీలో శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఉన్నది ఒకటే జీవితం, కృష్ణార్జున యుద్ధం, ఐ లవ్ యు చిత్రాల్లో సోలో హీరోయిన్ గా నటించింది. ఇవేమీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న అనుపమ రౌడీ బాయ్స్ మూవీలో బోల్డ్ రోల్ చేసింది. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. కార్తికేయ 2తో అనుపమ భారీ హిట్ కొట్టింది. చందూ మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఆడింది.

    ప్రస్తుతం తెలుగులో టిల్లు స్క్వేర్ లో నటిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. ఇది సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సీక్వెల్. ఈ మూవీలో అనుపమ రోల్ మరింత బోల్డ్ గా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అలాగే రవితేజ ఈగిల్ తో పాటు ఒక తమిళ్, మరొక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అనుపమ కెరీర్ సోసో గా సాగుతుంది. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా అలా చేసుకుంటూ పోతుంది.