Paradha Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో దర్శకులు సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సినిమా బండి’ అనే మూవీతో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ కందిరీగుల… ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో వచ్చిన ‘పరదా’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయినప్పటికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ఈ రోజు వేశారు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక గ్రామంలోని స్త్రీలు వాళ్ల ఆచారం ప్రకారం వల్ల ముఖం ఎవ్వరికి కనిపించకూడా పరదాలు వేసుకుని ఉంటారు. ఇక ఆ గ్రామంలో ఉన్న సుబ్బలక్ష్మి అనే అమ్మాయి అక్కడ్నుంచి వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆమె ఎందుకని వాళ్ళ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళింది. అక్కడ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. ఫైనల్ గా సుబ్బలక్ష్మి ఏం చేసింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాను చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని ప్రవీణ్ కందిరీగుల చాలా అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. తన అనుకున్న పాయింట్ ను ఎక్కడ కూడా డివియెట్ అవ్వకుండా చాలా క్లియర్ గా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్టాఫ్ మొత్తం సినిమాని ఒక డీసెంట్ ఎమోషన్ తో నడిపించిన ప్రవీణ్ కందిరీగుల సెకండాఫ్లో అక్కడక్కడ కొంతవరకు తడబడ్డప్పటికీ కోర్ ఎమోషన్స్ ను మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. క్లైమాక్స్ కొంతవరకు అసంతృప్తి కలిగించినప్పటికి ఓవరాల్ గా ఓకే అనిపించింది.
ఇక అనుపమ పరమేశ్వరన్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది… ఎక్కడైతే ఎమోషన్ కావాలో అక్కడ దర్శకుడు చాలా బాగా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశాడు. ప్రతి సన్నివేశంలో ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకున్నాడు. అందుకే దర్శకుడు ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు… ఇక తన మొదటి సినిమాని ఎలాగైతే ప్రేక్షకులకు చేరువు చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడో ఈ సినిమాని సైతం అదే రేంజ్ లో ముందుకు తీసుకెళ్లాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ చాలా అద్భుతంగా నటించింది. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఈ మూవీ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది. సుబ్బలక్ష్మి అనే ఒక క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి మరి నటించింది. ఇక ఆమె నటనలో చాలావరకు పరిణీతిని సంపాదించింది… తను లేకపోతే ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఉండేది కాదు. ఇంకా వేరే ఏ ఆర్టిస్ట్ చేసినా కూడా ఆ పాత్రను మనం ఓన్ చేసుకోలేకపోయే వాళ్ళం అనంతలా ప్రేక్షకుల్ని మైమరిపింపజేసింది… ఇక అనుపమ పరమేశ్వరన్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో రఘు మయూర్ చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు.
కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలావరకు హైలైట్ అయ్యాయి. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకి చాలా కీలకంగా నిలిచాడు. ఆయన పోషించిన పాత్ర కూడా సినిమాలో హైలెట్గా నిలిచిందనే చెప్పాలి… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
Also Read: చిరంజీవి బర్త్ డే కి అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడంటే..?
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ చాలా డీసెంట్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంది…ఈ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాటోగ్రాఫర్ చాలా చక్కటి విజువల్స్ ని అందించాడు. దర్శకుడి యొక్క భావాన్ని అర్థం చేసుకొని మరి అతను ఈ సినిమాకి విజువల్స్ ని అందించాడు… ఎడిటింగ్ బాగున్నప్పటికి సెకండాఫ్ లో కొంతవరకు సీన్లు లెంతీగా అనిపించాయి. కాబట్టి ఎడిటర్ దానిని కొంతవరకు కట్ చేసి ఉంటే బాగుండేది…
ప్లస్ పాయింట్స్
అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్
ఫస్టాఫ్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
ఎడిటింగ్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5