మలయాళ క్యూట్ బ్యూటీగా అనుపమ పరమేశ్వరన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చూడటానికి హోమ్లీగా కనిపించడం, దీనికి తోడు నటనలోనూ వేరియేషన్స్ చూపించడంతో తెలుగులో బాగానే ఛాన్స్ లను అందుకుంటూ కెరీర్ ను లాక్కొస్తోంది అనుపమ. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చట్లు పెట్టింది.
ఈ ముచ్చటించుకునే సందర్భంగా ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు, అనుపమ తనదైన శైలిలో చిరు నవ్వు నవ్వుతూ సమాధానాలు ఇచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా ?’ అంటూ ఓ ప్రశ్న అడిగాడు. సహజంగా ఇలాంటి ప్రశ్నలకు ఏ హీరోయిన్ నిజం చెప్పడానికి ఇష్టపడదు. కానీ అనుపమ మాత్రం నిజం చెబుతూ ఓపెన్ అయ్యింది.
‘తాను గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని, అయితే కొన్ని కారణాల కారణంగా అతనితో నాకు బ్రేకప్ అయిపోయిందని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది అనుపమ. కాకపోతే ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. అనుపమ తన మాజీ ప్రియుడి గురించి చెబుతున్న సమయంలో ఆమె కళ్ళల్లో ఇప్పటికీ ప్రేమ కొట్టొచ్చినట్టు తనుకొస్తునట్లు కనిపిస్తోంది.
ఇంతకీ అనుపమ లాంటి క్లాసిక్ భామను దూరం పెట్టిన అతగాడు ఎవరు అంటూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై అధికారిక ప్రకటన లేకపోయినా గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణం నడిపిందని ఆ మధ్య పుకార్లు తెగ పుట్టుకొచ్చాయి. అయితే, బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
బుమ్రా పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా అనుపమ సాడ్ సాంగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ ఎమోషనల్ అయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అనుపమ తన బ్రేకప్ విషయం బయటపెట్టి తనలోని బాధను వ్యక్తపరిచింది. మరి బుమ్రా నిజంగానే అనుపమను పేమించి బ్రేకప్ చెప్పాడా ?