spot_img
Homeఎంటర్టైన్మెంట్Anudeep Katikala Arrested: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్...

Anudeep Katikala Arrested: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

Anudeep Katikala Arrested: కామెడీ పేరుతో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి వాళ్ళైనా జైలు లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పడానికి ఉదాహరణ గా నిలిచాడు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల. రీసెంట్ గా ఇతను ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) , నిహారిక కొణిదెల , ఉపాసన లపై వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని, ఈ స్టాండప్ కమెడియన్ ప్రదర్శనలు ఇచ్చే చోటకు వెళ్లి కొట్టబోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే అనుదీప్ రెండు రోజుల తర్వాత క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశాడు, అయినప్పటికీ పవన్ అభిమానులు శాంతించలేదు.

ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే, లేదంటే ప్రతీ ఒక్కరు ఇలాగే వ్యక్తిగత విషయాలపై నోరు పారేసుకుంటూ క్షమాపణలు చెప్పి చేతులు దులిపేసుకుంటారు. కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో ఇలాంటి అంశాలపై కామెడీ చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ నాయకులూ కూడా అనుదీప్ పై పోలీస్ కేసు నమోదు చేయించారు. కేవలం కేసు నమోదు చేశారు, పోలీసులు యాక్షన్ తీసుకోవడం కష్టమేలే అని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవలే అనుదీప్ తన కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్ రాగ్ కి వెళ్ళాడు. కాకినాడ పోలీస్ బృందాలు అతని మొబైల్ లొకేషన్ ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

ప్రయాగ్ రాగ్ లోని ఒక పార్క్ లో తన తండ్రి తో కలిసి ఉండగా, పోలీసులు అక్కడికి వచ్చి అనుదీప్ ని అదుపులోకి తీసుకొని కాకినాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనుదీప్ కేవలం పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ మీద మాత్రమే కాదు, గతం లో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి హీరోల మీద కూడా చాలా నీచమైన కామెడీ చేసాడు. అతను అలా కామెడీ చేస్తుంటే, ఆ స్టాండప్ కామెడీ షో ని చూసేందుకు వచ్చిన ఆడియన్స్ కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేయడం గమనార్హం. కానీ అరెస్ట్ ద్వారా అయితే ఒక బలమైన సందేశం బయటకు వెళ్ళింది. ఇక మీదట కామెడీ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి , లేదంటే ఇంతకంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version