https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ అభిమానులకు దసరా గిఫ్ట్ గా … అంత ఇష్టం పాట విడుదల

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అభిమానులు ఆయన సినిమా రిలీజ్ సమయంలో, పుట్టిన రోజు కార్యక్రమాల్లో , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో, నెట్టింట్లో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల రాజకీయాల కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికి … వకీల్ సాబ్ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు. అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న […]

Written By: , Updated On : October 15, 2021 / 02:02 PM IST
Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అభిమానులు ఆయన సినిమా రిలీజ్ సమయంలో, పుట్టిన రోజు కార్యక్రమాల్లో , ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో, నెట్టింట్లో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల రాజకీయాల కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికి … వకీల్ సాబ్ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు. అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.

antha-istam-song-released-from-pawans-bheemla-nayak-movie

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రానా కూడా మరో హీరో గా నటిస్తుండగా… సాగర్ కె చంద్ర సినిమాకు దర్శక్త్వమ్ వహిస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి విడుదలైన తొలి సింగిల్, టీజర్, లు ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక కొద్ది రోజుల క్రితం భీమ్లా నాయక్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్… అంత ఇష్టం అనే పాటను విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

#AnthaIshtam Lyrical | BheemlaNayak Songs | Pawan Kalyan | Rana |Trivikram |SaagarKChandra | ThamanS

తాజాగా దసరా కానుకగా… అంత ఇష్టం ఏందయ్యా.. అనే పాటను మూవీ యూనిట్ విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్‌ చిత్ర ఆలపించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.