మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సల్మాన్ ప్లేస్ లో మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సల్మాన్ చేయాలనుకున్న పాత్రను చేస్తున్నాడట. శివరాజ్ కుమార్ ఈ సినిమా కోసం డేట్స్ కూడా సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.
సల్మాన్ మొదట ఈ సినిమాలో చేయాలని నిర్ణయించుకునప్పటికీ.. కొన్ని కారణాల కారణంగా ఈ సినిమాలో నటించట్లేదు. అందుకే టీమ్ శివరాజ్ కుమార్ ను అప్రోచ్ అయింది. ఇక చిరు కూడా ‘గాడ్ ఫాదర్’ మూవీకి తన డేట్స్ ను కెటాయించాడు. వచ్చే నెల 6వ తేదీ నుంచి 20 తేదీ వరకు షూట్ జరగనుంది.
ఈ షూట్ లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు. అయితే శివరాజ్ కుమార్ ఏ పాత్రలో నటిస్తున్నాడో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఆరా ఇస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రనే తెలుగు వెర్షన్ లో శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు.
నిజానికి శివరాజ్ కుమార్ రేంజ్ పాత్ర కాదు అట అది. జస్ట్ చిన్న అతిథి పాత్ర, అయినా శివరాజ్ కుమార్ మాత్రం మెగాస్టార్ కోసం నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి వెరీ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు.
ఆ మధ్య ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లో చిరు లుక్ చూసి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. అందుకే, ఈ సినిమా అప్ డేట్ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
