Stree 2: ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక విజయాలలో ఒకటిగా నిల్చిన చిత్రం ‘స్త్రీ 2’. బాలీవుడ్ లో చాలా కాలం నుండి ట్రేడ్ ఒక భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కరోనా పీరియడ్ తర్వాత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు తప్ప,మిగిలిన హీరోలెవ్వరూ కూడా సరైన హిట్ ని అందించలేకపోయారు. బాలీవుడ్ మొత్తం మన సౌత్ ఇండియన్ సినిమాల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వాళ్ళ పరువు పూర్తిగా పోయే సమయం లో ‘స్త్రీ 2’ చిత్రం విడుదలై కాసుల కనకవర్షం కురిపించింది. కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కామెడీ హారర్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో మైలు రాళ్లను దాటింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ చిత్రం 600 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన అతి తక్కువ చిత్రాలలో ఒకటిగా నిల్చింది.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 640 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం వసూళ్లను తప్ప స్త్రీ 2 ఇప్పటి వరకు ఉన్న బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది. ఈ వారం లోనే ఈ చిత్రం జవాన్ లైఫ్ టైం వసూళ్లను కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే బాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చిన ఏకైక లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ‘స్త్రీ2’ నిలిచిపోతుంది. ఈ సందర్భంగా ఆమె కాసేపటి క్రితమే ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. స్త్రీ 2 చిత్రం సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఆడవాళ్ళతో కలిసి ఆమె సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసింది. ఈ పోస్టు ని అప్లోడ్ చేసిన 4 గంటలోపే 1.6 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. శ్రద్ద కపూర్ కి ఇంస్టాగ్రామ్ లో ప్రధాన మంత్రి మోడీ ని మించిన ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఇండియా లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఓవర్సీస్ లో కేవలం 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గ్రాస్ వసూళ్ల పరంగా చూసుకుంటే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 845 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో 900 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేసుంటే 1000 కోట్ల రూపాయిలు కొల్లగొట్టేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.