https://oktelugu.com/

Tirumala Laddu : పాత శత్రువులతో కొత్త యుద్ధం.. తిరుపతి లడ్డూపై బీజేపీ-టీడీపీకి షాకిచ్చిన సుబ్రహ్మణ్యస్వామి

సాధారణంగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లది ప్రత్యేక స్థానం. ఈ విషయంలో గత కొద్దిరోజులుగా కీచులాట నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా పెద్ద యుద్ధానికి దారితీసింది.

Written By:
  • Dharma
  • , Updated On : September 23, 2024 / 03:54 PM IST

    Tirupathi Laddu

    Follow us on

    Tirumala Laddu :  బీజేపీలో మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రూట్ వేరు. ఆయన ఎప్పుడు ఎవరిపై పడతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు తాజాగా టీటీడీ లడ్డు వివాదం పైపడ్డారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భావిస్తున్నారు. అందుకే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తిరుపతి లడ్డులో జంతు నూనె కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై జాతీయ స్థాయిలో సైతం చర్చ జరుగుతోంది. ఆపై వివాదం రగులుతోంది. అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచింది. ఎన్డీఏ కు చెందిన కేంద్ర మంత్రులు దీనిపై స్పందిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ సైతం సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బిజెపికి చెందిన నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించడం విశేషం. ఈ విషయంలో చంద్రబాబు మాటలు నమ్మకంగా లేవని స్వయంగా సుబ్రహ్మణ్యస్వామి లేవనెత్తడం మరో సంచలనానికి దారితీస్తోంది. అయితే ఆయనపై టిడిపి శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఆయన ప్రో వైసిపి నేతగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి.

    * గతంలో సైతం వివాదాస్పదం
    సుబ్రహ్మణ్యస్వామి గతంలో సైతం వివాదాస్పదం అయ్యారు. అనుహ్య పరిస్థితుల్లో ఆయన బిజెపి గూటికి చేరారు. అయితే సొంత పార్టీకి ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ అధికారపక్షంలో ఉన్నప్పుడు సైతం దానికి సపోర్ట్ చేశారు సుబ్రహ్మణ్యస్వామి. ఏపీలో పొత్తుల విషయంలో కూడా చాలా సందర్భాల్లో కామెంట్స్ చేశారు. కానీ అందుకు విరుద్ధంగా బిజెపి హై కమాండ్ టిడిపి తో పొత్తు పెట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాన్ని పంచుకుంది. అయినా సరే సుబ్రహ్మణ్యస్వామి తన సొంత పార్టీ బిజెపికి అనుకూలంగా, అదే సమయంలో ప్రత్యర్థులపై సానుకూలత వ్యక్తం చేశాలా ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం తిరుపతి లడ్డు వ్యవహారంలో వైసీపీకి వెనకేసుకొచ్చేలా ఆయన మాట్లాడుతూ ఉండడం విశేషం.

    * సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
    సుబ్రహ్మణ్యస్వామికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కానీ ఇంతవరకు ఏ పార్టీలో కూడా కుదురుగా ఉండలేదు. అవకాశం ఇచ్చిన పార్టీలకు హ్యాండ్ ఇచ్చి ఆయన బిజెపిలో చేరారు. జాతీయ రాజకీయ అంశాలను ప్రస్తావిస్తున్నారు. అందుకే కక్కలేక మింగలేని పరిస్థితి. అయితే దీనిని గుర్తించిన జగన్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రక్షాళనకు సిద్ధపడ్డారు. అయితే పరిస్థితి మాత్రం అనుకూలించడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.

    * గత ఐదేళ్లుగా పట్టించుకోని నేత
    ఏపీలో బిజెపి టిడిపి తో కలయికను వ్యతిరేకించిన వారిలో సుబ్రహ్మణ్యస్వామి ఒకరు. ఆయన వైసీపీకి అనుకూల నేత అని ప్రచారం జరుగుతుంది
    . గత ఐదేళ్లుగా వైసీపీతో బిజెపి స్నేహం కొనసాగించింది. ఆ సందర్భంలో వ్యతిరేకించింది తక్కువ. కానీ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి అంశం హాట్ టాపిక్ గా మారింది. దీంతో లోకల్ నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.