మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ను మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నాడు. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఒకరకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది. అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని, ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీకి సూట్ అవ్వదని మెగాస్టార్ ఫీల్ అయ్యారు. అందుకే ఆ పాత్రలో ఇప్పుడు మరో హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు.
Also Read: బాలయ్య అనగానే నో అంటున్న హీరోలు !
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ పాత్రలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ మొదలయ్యాయి. నిజానికి విజయ్ దేవరకొండ అయితే ఆ పాత్రలో చాల బాగుంటాడు. పైగా విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి.. అది మెగా సినిమాకే ప్లస్ అవుతుంది. ఏ రకంగా చూసుకున్న విజయ్ నే బెస్ట్ అప్షన్ అవుతుంది కాబట్టి.. మెగాస్టార్ కూడా విజయ్ దేవరకొండ వైపే మొగ్గు చూపిస్తున్నాడట.
Also Read: హీరోగారి పై చీటింగ్ కేసు !
అలాగే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో సుహాసిని నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలకమైన మార్పులను సూచించగా.. డైరెక్టర్ మోహన్, రైటర్ సాయి మాధవ్ తో కలిసి ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి ఫుల్ స్క్రిప్ట్ చెప్పడం, లేటెస్ట్ వెర్షన్ మెగాస్టార్ కి బాగా నచ్చడంతో సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Another rumor on megastar lucifer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com