RRR: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ట్రైలర్ కొత్త రికార్డు నమోదు చేసింది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్‌లో మరో మైలు రాయి దాటింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 15 కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక 15 కోట్ల వ్యూస్ అంటే.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక రికార్డ్. ఇక ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ తో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కానుంది. ఎంతైనా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: ఆకట్టుకున్న ‘డీజే టిల్లు’ ట్రైలర్.. వార్తలకెక్కిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు !
అందుకే, ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని అన్ని ముఖ్యమైన భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. పైగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అందుకే హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కోసం పడిగాపులు కాస్తున్నారు.
కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
Also Read: వైరల్ అవుతున్న సమంత కొత్త ఫోటోలు !