Bigg Boss 7 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ మొదట్లో కాస్త డల్ గా సాగిన.. ప్రస్తుతం మాత్రం మంచి రేటింగ్ తో దూసుకొని పోతుంది. ఈ సీజన్ ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేటై వెళ్తున్నారు. ఈ వారం కూడా అందరూ ఊహించినట్టే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. ఈయన వెళ్తూ వెళ్తూ ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అదేనండి ఏకంగా రూ. 15 లక్షలు అందుకున్నారట. ఈయన వెళ్లిపోయిన తర్వాత ఆట సందీప్ బిగ్ బాస్ హౌజ్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
సందీప్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం అవడంతో ఎలా సందీప్ ఎంట్రీ ఇస్తాడు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయట. రతికా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈమెకు అవకాశం ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. సందీప్ కు కనుక అవకాశం ఇస్తే ఒకేసారి నామినేట్, ఎలిమినేట్ అయినా సందీప్ కు న్యాయం జరిగినట్టు అవుతుందని టాక్. అంతేకాదు మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీకి గురించిన పూర్తి వివరాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయినా సందీప్ రీ ఎంట్రీ ఇస్తే ఉపయోగం ఏంటని ఆయనంటే నచ్చని వారు కూడా అంటున్నారు. మరి పాజిటివ్, నెగిటివ్ ల మధ్య ఆట సందీప్ ఎంట్రీ జరుగుతుందా లేదా అనేది చూడాలి.
సందీప్ రీ ఎంట్రీపై బిగ్ బాస్ కూడా పాజిటివ్ గానే ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సీజన్ 7 రేటింగ్ కూడా పుంజుకుంది. ఇక హోస్ట్ నాగార్జున వల్ల అది మరింత పెరిగిందనే టాక్ కూడా ఉంది. కానీ ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఏకంగా రూ. 20 కోట్లను ఛార్జ్ చేశారట. సినిమాల్లో కూడా నటిస్తున్న నాగార్జున భారీ మొత్తంలోనే ఛార్జ్ చేస్తున్నారు. ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సారి బిగ్ బాస్ కు కూడా రెమ్యూనరేషన్ పెంచేశారట నాగార్జున.