Pawan Kalyan- Sujeeth Movie: హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. అందుకే పవన్ సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆదరణ దక్కించుకుంటాయి. సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు మాకు పండగే అంటారు. ఇతర స్టార్ హీరోల సినిమా బాగోకపోతే ఫ్యాన్స్ నొచ్చుకుంటారు. అభిమాన హీరోని దూషించడానికి కూడా వెనకాడరు. పవన్ అభిమానులు అలా చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఆయన ఎలా కనిపించినా మేము అంగీకరిస్తాము అంటారు.

ఆయన రీఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల ఫలితాలు ఇందుకు నిదర్శనం. హీరోయిజం పెద్దగా స్కోప్ లేని ఈ రెండు చిత్రాలు ఎవరు చేసినా డిజాస్టర్స్ అయ్యేవి. వకీల్ సాబ్ హిందీ చిత్రం పింక్ రీమేక్ కాగా ఒరిజినల్ లో అమితాబ్ చేశారు. ఇక భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్. ఈ రెండు చిత్రాల్లో హీరో పాత్ర కథలో భాగంగా ఉంటుంది. స్టార్ హీరోలకు సెట్ అయ్యే కథలు కావు.
అయితే పవన్ ఆ రెండు ఛాలెంజింగ్ గా తీసుకొని హిట్స్ కొట్టి చూపించాడు. పవన్ ఇమేజ్, రేంజ్ చెప్పడానికి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విజయాలు గొప్ప ఉదాహరణలు. ఆ చిత్రాల్లో ఆయన పాత్రల నిడివి కూడా తక్కువ. వకీల్ సాబ్ లో కథ మొదలైన అరగంట తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది. ఇక భీమ్లా నాయక్ లో హీరో రానాకు సమానమైన స్క్రీన్ స్పేస్ ఉంటుంది.అలాగే పవన్ కళ్యాణ్ సైన్ చేసినట్లు ప్రచారం అవుతున్న వినోదయ సిత్తం రీమేక్ లో కూడా స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది.

ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ ఇటీవల ప్రకటించిన సుజీత్ మూవీలో పవన్ ఎంట్రీ ఇలా ఉంటుందంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. చిత్ర ప్రకటన రోజు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. సదరు పోస్టర్ లో ఇది ముంబై, జపాన్ నేపథ్యంలో సాగే మాఫియా స్టోరీ అని హింట్ ఇచ్చారు. పవన్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. అయితే పవన్ ఎంట్రీ సినిమా మొదలైన 20 నిమిషాలకు ఉంటుందట. అప్పటి వరకు ఆయన రాకకు కావలసిన మంచి సెటప్ తో సుజీత్ కథ నడిపిస్తాడట. కీలక సమయంలో పవన్ ఎంట్రీ ఫ్యాన్స్ కి గుడ్ బంప్స్ కలిగిస్తుందట. ఈ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.