Balakrishna : మహేష్  తర్వాత  బాలయ్యతోనే చేస్తాడట ! 

Another feast for Balayya fans :  బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది.  దాంతో ఇప్పుడు అందరూ బాలయ్య షో అసలు  ఎందుకు హిట్ అయింది ? షోలో ఏముంది ? అంటూ చర్చ మొదలైంది. అయితే, బాలయ్య   షో  హిట్ కి  మెయిన్ రీజన్  బాలయ్యకు ఉన్న క్రేజే అని తెలుస్తోంది . అసలు బాలయ్యకు  ఎందుకు అంత క్రేజ్ ?  సోషల్ మీడియాలో బాలయ్య  ఎన్నడూ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 13, 2022 8:17 pm
Follow us on

Another feast for Balayya fans :  బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది.  దాంతో ఇప్పుడు అందరూ బాలయ్య షో అసలు  ఎందుకు హిట్ అయింది ? షోలో ఏముంది ? అంటూ చర్చ మొదలైంది. అయితే, బాలయ్య   షో  హిట్ కి  మెయిన్ రీజన్  బాలయ్యకు ఉన్న క్రేజే అని తెలుస్తోంది . అసలు బాలయ్యకు  ఎందుకు అంత క్రేజ్ ?  సోషల్ మీడియాలో బాలయ్య  ఎన్నడూ యాక్టివ్ గా కూడా ఉండడు కదా. మరీ బాలయ్య వీడియోలు ఎందుకు  బాగా వైరల్ అవుతున్నాయి.

Balayya

బాలయ్య  వ్యక్తిత్వం జనానికి బాగా నచ్చింది.  పైగా బాలయ్య   ఓ   ప్రత్యేకమైన వ్యక్తిగా   అందరూ బావిస్తారు.  వరుస ప్లాప్ లు వస్తున్నా.. బాలయ్య  దేనికీ వెనుదిరగడు.  స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే.. హిట్ వస్తోంది అని తెలిసినా.. నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్టు  అందుబాటులో ఉన్న డైరెక్టర్లతో  సినిమాలు  చేసే  దమ్ము బాలయ్యకి ఉంది.   ఆ చేసిన  సినిమాలు  ప్లాప్ అయినా..  అసలు ఓడిపోయాం అనే భావనే ఏనాడూ  బాలయ్య ఉండడు. అసలు ఆ భావన రానివ్వడు.

ముఖ్యంగా ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తాడు.  నమ్మిన పనిని నచ్చినట్టు చేసే తెగింపు బాలయ్య సొంతం.  ఇక బాలయ్య బాబుకు  విమర్శలు పెద్దగా పట్టవు.  తన పద్ధతేదో తనదే. ఇక  గెలుపోటములు బాలయ్య  క్రేజుని వంగదీయలేవు.  అన్నింటికి  మించి బాలయ్య ఆలచనలో  డ్రామాలు ఉండవు.  తన మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు వస్తోంది.  ఇక సేవలోనూ  సాయంలోనూ  బాలయ్య తనదైన శైలిలో ముందుకు  పోతాడు.   అందుకే   బాలయ్యకి  సెపరేట్  క్రేజ్ ఉంది.

ఏది ఏమైనా  బాలయ్య అంటే  బాలయ్యే.  మొత్తానికి ఇనాళ్ళకు   బాలయ్యతో సినిమా చేయాలని  స్టార్ డైరెక్టర్లు కూడా ఆలోచన చేస్తున్నారు.  ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్  కూడా  బాలయ్యతో  ఒక సినిమా  చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.  మహేష్  బాబుతో సర్కారు వారి పాట  సినిమా పూర్తి అవ్వగానే   బాలయ్యతో సినిమా స్టార్ట్ చేస్తాడట. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా  ఇప్పటికే  పూర్తి అయిందని తెలుస్తోంది.

Balayya