Shyam Singha Roy Deleted Scene: హీరో నాని, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం ఓటీటీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. కాగా ‘శ్యామ్‌సింగరాయ్’ నుంచి వరుసగా డిలీటెడ్ సీన్లను చిత్ర యూనిట్ విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే మూడు సీన్లను రిలీజ్ చేసింది. తాజాగా మరో డిలీటెడ్ సీన్ ను కూడా రిలీజ్ చేసింది. హీరో నాని పోషించిన వాసుదేవ్ పాత్రపై నడిచే ఈ సీన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాగా ఈ సీన్ లో నాని తన యాక్టింగ్ తో సినీ ప్రియులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా సూపర్ హిట్ ఈ చిత్రాన్ని దాదాపు ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూసి ఉంటాడు. ముఖ్యంగా ద్వితీయార్థం పొయిటిక్ గా ఉంటుంది. అయితే నిడివి దృష్ట్యా, అటువంటి కొన్ని సీన్లను ఎడిట్ చేసి తీసేసారు. వాటిలో నుండి ఇలా వరుసగా సీన్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.
మరోపక్క విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ముందే క్యాష్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు రూ.32 కోట్లు రాబట్టింది. అంటే పూర్తి లాభాల్లోకి ‘శ్యామ్ సింగ రాయ్’ వెళ్ళిపోయాడు. దేవదాసీల బాధలను శ్యామ్ సింగరాయ్ సినిమా చాలా బాగా చూపించింది.
అందుకే, నాని కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కృతి శెట్టి మరో హీరోయిన్ గా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మంచి విజయం సాధించింది.