https://oktelugu.com/

Rashmika Mandana : తెరపైకి రష్మిక మందాన మరో డీప్ ఫేక్ వీడియో… ఈసారి మరింత హాట్ గా!.. వైరల్ వీడియో

ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను ఎదుర్కొన్నాను. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటని రష్మిక మందాన అభిప్రాయపడింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2023 / 09:20 AM IST
    Follow us on

    Rashmika Mandana : ఇటీవల రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో హాట్ గా ఉంది. ఆ వీడియో నిజంగా రష్మిక మందాన చేశారని చాలా మంది భావించారు. కొందరు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ జర్నలిస్ట్ తన అధికారిక ఖాతాలో రియల్ వీడియో పోస్ట్ చేశాడు. ఇది డీప్ ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియోపై అమితాబ్ కూడా స్పందించాడు. ఇది సీరియస్ మేటర్, ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కామెంట్ చేశారు.

    ఆ వీడియో బ్రిటన్ కి చెందిన భారతీయ మూలాలున్న యువతిది. ఆమె పేరు జరా పటేల్. ఆమె తరచుగా హాట్ వీడియోలు, ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. జరా పటేల్ వీడియోను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో రష్మిక మందానదిగా మార్చారు. జరా పటేల్ సైతం ఈ వీడియోపై స్పందించడం విశేషం. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అయినా ఇలా జరిగినందుకు చింతిస్తున్నాను, అని చెప్పుకొచ్చింది.

    ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను ఎదుర్కొన్నాను. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటని రష్మిక మందాన అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం శూన్యం. నిందితులను పట్టుకోలేదు.

    దీంతో ఆకతాయిలు మరోసారి రెచ్చిపోయారు. రష్మిక పై మరో డీప్ ఫేక్ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా వల్గర్ గా ఉంది. అలియా భట్, కాజోల్, ప్రియాంక చోప్రాతో పాటు పలువురి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీన్ని నియంత్రించడం ప్రభుత్వాల వల్ల అయ్యేలా లేదు. రానున్న కాలంలో ఎందరు బలి కానున్నారో…