https://oktelugu.com/

Rashmika Mandana : రష్మిక మందాన మరో డీప్ ఫేక్ వీడియో… ఈసారి అలాంటి ఫోజుల్లో!

ఒక హీరోయిన్ గా ఇలాంటివి నేను ఎదుర్కొనగలను. ఒకవేళ నేను కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే పరిస్థితి ఏంటని రష్మిక మందాన గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. పలువురు హీరోలు, హీరోయిన్స్ రష్మిక మందానకు మద్దతుగా నిలిచారు. ఇక రష్మిక మందాన కెరీర్ పరిశీలిస్తే... యానిమల్ రూపంలో ఆమెకు భారీ హిట్ పడింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 08:10 AM IST

    Rashmika Mandana

    Follow us on

    Rashmika Mandana : డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వణికిస్తోంది. ఒక్కొక్కటిగా స్టార్ హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు తెరపైకి వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు, క్రిమినల్స్ కావాలని హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గత ఏడాది రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో సంచలనం రేపింది. బ్రిటన్ యువతి జరా పటేల్ వీడియోను రష్మిక మందాన వీడియోగా వైరల్ చేశారు. జరా పటేల్ హాట్ వీడియోకి రష్మిక మందాన ముఖం డీప్ ఫేక్ చేయడంతో చాలా మంది ఒరిజినల్ వీడియో అనుకున్నారు.

    ఈ డీప్ ఫేక్ వీడియోను ఓ జర్నలిస్ట్ వెలుగులోకి తెచ్చాడు. దీనిపై ఏకంగా అమితాబ్ బచ్చన్ స్పందించారు. ప్రభుత్వాలు అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన సమస్య అని అమితాబ్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ వీడియో కదిలించింది. నెలల తరబడి సాగిన విచారణలో గుంటూరుకు చెందిన యువకుడిని అరెస్ట్ చేశాడు. అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఇంత జరిగినా డీప్ ఫేక్ వీడియోలు ఆగడం లేదు. రష్మిక మందాన మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతుంది.

    ఓ యువతి డాన్స్ చేస్తున్న వీడియోను రష్మిక మందానకు చెందినదిగా డీప్ ఫేక్ చేశారు. దీంతో సమస్య మరోసారి చర్చకు వచ్చింది. నేరం అని తెలిసి కూడా కొందరు సాంకేతికతను వాడుకుని నేరాలు చేస్తున్నారు. కాగా అలియా భట్, కాజోల్, నోరా ఫతేహి, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వారందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. రష్మిక మందాన మరోసారి దీనికి బలైంది.

    ఒక హీరోయిన్ గా ఇలాంటివి నేను ఎదుర్కొనగలను. ఒకవేళ నేను కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే పరిస్థితి ఏంటని రష్మిక మందాన గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. పలువురు హీరోలు, హీరోయిన్స్ రష్మిక మందానకు మద్దతుగా నిలిచారు. ఇక రష్మిక మందాన కెరీర్ పరిశీలిస్తే… యానిమల్ రూపంలో ఆమెకు భారీ హిట్ పడింది. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. నెక్స్ట్ పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రైన్ బో చిత్రాల్లో కనిపించనుంది.