Homeఎంటర్టైన్మెంట్Tiger Nageswara Rao Movie New Update: నాగేశ్వరరావు' కోసం మరో హీరోయిన్ రెడీ

Tiger Nageswara Rao Movie New Update: నాగేశ్వరరావు’ కోసం మరో హీరోయిన్ రెడీ

Tiger Nageswara Rao Movie New Update: 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు ‘టైగర్ నాగేశ్వరరావు’. కాగా ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో ఇప్పటికే కృతీ సనన్‌ సోదరి నుపూర్‌ సనన్‌ను హీరోయిన్‌ గా నటిస్తోంది.

Tiger Nageswara Rao Movie New Update
Tiger Nageswara Rao Movie New Update

అయితే, చిత్రయూనిట్‌ తాజాగా మరో హీరోయిన్‌ ను సెలక్ట్‌ చేసింది.ఇండియన్‌ మోడల్‌, నటి గాయత్రి భరద్వాజ్‌ కూడా ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా ముహూర్తం, ప్రీలుక్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12.06 గంటలకు ఫిక్స్ చేశారు. ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పైగా రవితేజ హీరో.. కాబట్టి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం.

Also Read: Regional Ring Road: ఆర్ఆర్ఆర్ కు కేంద్రం సై: హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం

అన్నట్టు ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘వంశీకృష్ణ’ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. నిజానికి ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలవ్వాలి. మొదట ఈ సినిమాలో రానాని హీరోగా అనుకున్నారు. రానా కూడా సినిమా చేయడానికి అంగీకరించాడు.

రానా పై కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా చేశారు. అయితే, షూట్ చేసిన తరువాత ఆ పార్ట్ రానాకీ నచ్చలేదు. దాంతో రానా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను చేయాలనుకున్నారు. కాకపోతే, బెల్లంకొండ కూడా కథలో లోపాలు ఉన్నాయంటూ.. మొత్తానికి మధ్యలోనే ఈ సినిమా నుండి డ్రాప్ అయిపోయాడు.

Tiger Nageswara Rao Movie New Update
Tiger Nageswara Rao Movie New Update

ఇక అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమా హీరో పై అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి రవితేజ ఈ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి రవితేజకు ఈ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడు అనేది చూడాలి. సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట. దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Harnaaz Sandhu: నాకు ఆ వ్యాధి ఉంది.. మిస్ యూనివర్స్ షాకింగ్ కామెంట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version