Raj Tarun: ప్రముఖ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), లావణ్య(Lavanya) వ్యవహారం గత ఏడాది నుండి ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదట్లో లావణ్య కి జనాల నుండి కాస్త సపోర్టు వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆమె ప్రవర్తన ని చూసి జనాలు రాజ్ తరుణ్ వైపు సానుభూతి చూపించడం మొదలు పెట్టారు. వీళ్లిద్దరి వ్యవహారం లో రాజ్ తరుణ్ అమాయకుడు అని తేలడం తో , లావణ్య కూడా ఇక చేసేది ఏమి లేక సైలెంట్ అయిపోయింది. ఒకానొక సందర్భం లో ఆమె రాజ్ తరుణ్ కి మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే కొద్దినెలల క్రితం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కారణం లావణ్య ప్రస్తుతం ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్ తన కష్టార్జీతమ్ తో సంపాదించుకున్నది.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
లావణ్య తో విడిపోయిన తర్వాత ఆయన ఈ ఇంటిని స్వాధీన పర్చుకోలేదు, ఆమెకే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ రాజ్ తరుణ్ తల్లితండ్రులు మాత్రం వదల్లేదు. ప్రస్తుతం తాము ఉంటున్న ఇంట్లో రెంట్ కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, రాజ్ తరుణ్ కెరీర్ కూడా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నడవడం లేదని, కాబట్టి మా ఇల్లు మాకు తిరిగి ఇచ్చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అందుకు లావణ్య ఒప్పుకోకపోవడంతో చాలా పెద్ద గొడవ జరిగింది. దీనిపై లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై నాసింగి పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. జూన్ 30 న రాజ్ తరుణ్ తన అనుచరలులతో కలిసి నా కుటుంబ సభ్యులపై దాడి చేశాడని, మా ఇంట్లో బంగారం ని ఎత్తుకెళ్ళడంతో పాటు, మా కుక్క ని కూడా చంపేశారని, ఈ ఘటనలో నా తండ్రి గాయపడ్డాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇది సైబరాబాద్ CP దృష్టికి వెళ్లగా, ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం లో ఒక ద్విభాషా చిత్రంలో రాజ్ తరుణ్ హీరో హీరోగా నటిస్తున్నాడు. జులై నుండి ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఇది కాకుండా పీరియాడికల్ జానర్ లో ఆయన మరో సినిమా కూడా చేసాడు. అయితే సెప్టెంబర్ 7 నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనాల్సిందిగా బిగ్ బాస్ టీం రాజ్ తరుణ్ ని సంప్రదించారని, ఆయన నిర్ణయం ఏంటో ఇంకా తెలియజేయాల్సి ఉందని అంటున్నారు.