
దేశంలో కరోనా మహమ్మరి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా ఆ స్థానానికి భారత్ చేరుకునేలా కన్పిస్తోంది. అన్ని దేశాల కంటే ముందుగానే భారత్ లాక్డౌన్ విధించింది. అయినప్పటికీ కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో కరోనా కేసులతోపాటు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
కరోనా మహమ్మరి చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ పొట్టన పెట్టుకుంది. ఈక్రమంలో దేశంలోని ప్రముఖులంతా కరోనా బారినపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడగా.. బ్రెయిన్ సంబంధ వ్యాధితో మృతిచెందారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దర్శక దిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రముఖ సింగర్ బాలసుబ్రమ్మణ్యం తదితరులు కరోనా బారినపడ్డారు. వీరంతా కరోనా జయించడంతో వారి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రధానంగా సినీ, రాజకీయ రంగాల్లోని వారు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నారు. ఈక్రమంగానే తాజాగా మరో బాలీవుడ్ నటి జరీనా వహాబ్ కరోనా సోకినట్లు తెలుస్తోంది. జరీనా వహాబ్ తెలుగులో ‘విరాటపర్వం’ మూవీలో నటిస్తోంది. రానా.. సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న విరాటపర్వంలో జరీనా వహాన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
కొద్దిరోజులుగా జరీనా వహాబ్ జ్వరం.. శ్వాసకోస.. ఒళ్లు నొప్పులతో బాధపడుతోంది. ఈ క్రమంలో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయిందట. ఈక్రమంలో వైద్యులు ఆమెకు చికత్స అందిస్తున్నారు. త్వరలోనే కరోనా నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. జరీనా వహాబ్ హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది.