Sonu Sood: సోనూసూద్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత !

Sonu Sood: ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ కి “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు ఇస్తుంటే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఆయనకు అరుదైన ఘనతలు దక్కుతున్నాయి. తాజాగా ట్విట్టర్‌లో సోనూసూద్‌ అరుదైన ఘనతను అందుకున్నారు. సోనూసూద్ మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడిగా సోనూసూద్ నిలవడం విశేషం. అంతే కాకుండా ట్విట్టర్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు సమస్యలపై […]

Written By: Sekhar Katiki, Updated On : January 19, 2022 4:04 pm
Follow us on

Sonu Sood: ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ కి “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు ఇస్తుంటే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఆయనకు అరుదైన ఘనతలు దక్కుతున్నాయి. తాజాగా ట్విట్టర్‌లో సోనూసూద్‌ అరుదైన ఘనతను అందుకున్నారు. సోనూసూద్ మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడిగా సోనూసూద్ నిలవడం విశేషం.

Sonu Sood

అంతే కాకుండా ట్విట్టర్‌లో ఆయన చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వస్తున్నాడు. అసలు కరోనా మహమ్మారి దావానలంగా దేశం మొత్తం వ్యాప్తి చెంది, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు పొట్టన పెట్టుకుంటూ ఉన్న కాలంలో కూడా ఎంతోమందిని ఆదుకున్నారు సోనూసూద్. అసలు కరోనా దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తోన్న తరుణంలో పేద ప్రజల పరిస్థితిని బాగు చేయడానికి సోనూసూద్ చాలా సేవ చేశాడు.

Also Read:  సోనూసూద్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే !

అలాగే, కరోనా సోకి సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సోనూసూద్ మంచి వైద్యం చేయించాడు. మొత్తానికి కఠినమైన పరిస్థితుల్లో సామాన్యుడికి అండగా నిలబడిన వ్యక్తి ‘సోనూసూద్’. అందుకే ప్రతి ఒక్కరు సోనూసూద్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆశిద్దాం. అయినా సమాజంలో మూకుమ్మడి సమస్య వస్తే ఎవరైనా ప్రభుత్వానికి చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు ప్రజలు తమ సమస్యకి పరిష్కారం చూపమని సోనూసూద్ ను అడుగుతున్నారు. ఇది గొప్ప విషయమే.

Also Read: హోస్ట్ గా వెంకీ.. బాలయ్యలా సక్సెస్ అవుతాడా ?

Tags