Annamalai: శీర్షిక చదివారు కదా.. అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ గానే మాకు తెలుసు.. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ నాయకుడిగానే తెలుసు.. ఇప్పుడు బిజెపి నుంచి పక్కకు తప్పుకొని.. సొంత పార్టీ పెడుతున్న వ్యక్తిగానే తెలుసు.. కానీ ఆయన ఎ ప్పుడు హీరో అయ్యాడు.. ఎప్పుడు సినిమాలు తీశాడు.. అవి ఎప్పుడు విడుదలయ్యాయి.. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రీ రిలీజ్ అవుతున్నాయి.. ఇన్ని ప్రశ్నలు మీలో వ్యక్తం అవుతున్నాయి కదా.. వాటన్నింటికీ సమాధానమే ఈ కథనం.
తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు అక్కడి రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అన్నామలై. బిజెపికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ముందు ఆయన వీ ది లీడర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆన్లైన్లో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆయన ఏర్పాటుచేసిన ఈ సంస్థకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున స్పందన వస్తోంది. ఈ క్రమంలో అన్నామలై ఏర్పాటు చేసిన వీ ది లీడర్స్ సంస్థపై టీవీకే నేతలు రియాక్డ్ అయ్యారు.
అన్నామలై ఏర్పాటుచేసిన వీ ది లీడర్స్ అనే సంస్థ మళ్ళీ విడుదల చేసిన పాత చిత్రం లాంటిదేనని.. ఈ ఉద్యమం ప్రజలను అంతగా కదిలించదని టీవీకి నేతలు అంటున్నారు. ప్రతిసారి మళ్లీ విడుదలైన చిత్రాన్ని ప్రజలు అంతగా చూడరు. అన్నమలై పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసు. అలాంటప్పుడు తమిళనాడు రాజకీయాలలో ఏ మేరకు ఆయన ప్రభావం చూపించగలరు అంటూ టీవీకే నేత.. మంత్రి కేజీ అరుణ్ రాజు ఆరోపించారు.. “బిజెపిలో ఆయన పరిస్థితి బాగోలేదు. అందువల్లే బయటికి వచ్చారు. ఎన్నికల్లో ఆయన సేవలను పార్టీ ఎలా ఉపయోగించుకుందో అందరికీ తెలుసు. పైగా ఆయన నాయకత్వంలో బిజెపి తమిళనాడులో ఏ స్థాయిలో ఎదిగిందో కూడా అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆయన ఏదో సంస్థ పెడితే తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోతాయి. తమిళనాడు ప్రజలు విజయ్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అందువల్లే ఈ స్థాయిలో తమిళనాడు రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి స్థానం మీద అందరికీ ఆశలుంటాయి. అందులో తప్పులేదు. కానీ ముఖ్యమంత్రి కావడం అంత సులభం కాదని” అరుణ్ రాజ్ పేర్కొన్నారు.
అన్నామలై ఏర్పాటు చేసిన వీ ది లీడర్స్ క్యాంపెయిన్ లో ఇప్పటికే లక్షలమంది రిజిస్టర్ చేసుకున్నారు. అసంఖ్య 15 లక్షలను దాటిపోయింది. ఈ జోరు ఇలాగే కొనసాగితే అది త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉంది. అదే గనక జరిగితే తమిళనాడు రాజకీయాలలో సంచలనం నమోదు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
