Homeఎంటర్టైన్మెంట్Anna Lezhneva emotional post: చిరంజీవి, నాగబాబు లపై పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా...

Anna Lezhneva emotional post: చిరంజీవి, నాగబాబు లపై పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్..

Anna Lezhneva emotional post: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా నిన్న ఇన్ స్టాగ్రామ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేవలం 24 గంటల్లోనే ఆమెకు 2 లక్షల 60 వేల మంది ఫాలోవర్లు వచ్చేసారు. మొదటి పోస్ట్ ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటో పెట్టడం బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా చిరంజీవి గారి ఆశీస్సులతో , పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నా లెజినోవా అనడం , అందుకు చిరంజీవి రెస్పాన్స్ ఇస్తూ, అన్నా లెజినోవా కి స్వగతం పలుకుతూ తన తన స్టోరీ లో అప్లోడ్ చేయడం వంటివి అభిమానులకు కనుల పండుగ లాగా అనిపించింది. ఇకపోతే నేడు ఆమె కాసేపటి క్రితమే అప్లోడ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.

ఇందులో చిరంజీవి, నాగబాబు లతో తనకు ఉన్నటువంటి అనుభందం గురించి వివరిస్తూ, చాలా ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే ‘దాదాపుగా 15 ఏళ్ళ క్రితం , కొణిదెల ఫ్యామిలీ లోకి అడుగుపెట్టినప్పుడు, ప్రతీ ఒక్కరు ఎవరి రిలేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఈ కుటుంబం లో నేను ఎలా కలిసిపోతానో, ఎవరెవరిని ఏమని పిలవాలో నాకు అప్పట్లో తెలిసేది కాదు. అలాంటి సమయం నా భర్త నుండి అన్నయ్య , చిన్న అన్నయ్య అనే పదాలను తెలుసుకున్నాను. నాకు తోడబుట్టిన అన్న కానీ , తమ్ముడు కానీ లేడు. కానీ ఇప్పుడు నాకు చిరంజీవి , నాగబాబు రూపం లో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా అభిమానులకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఈమె నేడు అప్లోడ్ చేసిన పోస్ట్ లోని ఫోటోలలో చిరంజీవి తనతో సాన్నిహిత్యం గా ఉన్న విధానం చూస్తే, వీళ్ళ మధ్య ఎంత ప్రేమానుబంధం ఉందో అర్థం అవుతోంది.

అన్నా లెజినోవా తీరుని చూస్తుంటే , ఇక పై ఆమె సోషల్ మీడియా లో ఫుల్ యాక్టీవ్ గా ఉండేలా అనిపిస్తోంది. ప్రతీ రోజు ఇలా అరుదైన ఫోటోలను , తన ఎమోషన్స్ ని పంచుకుంటే చాలా సంతోషం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా, మార్క్ శంకర్ లేటెస్ట్ ఫోటోల కోసం కూడా అభిమానులు ఆతృతగా ఎదురు చూసున్నారు. ఇకపోతే ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు ఈమె మెగా ఫ్యామిలీ కి చెందిన వాళ్ళను కాకుండా బయట వారిలో నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు, సమంత , శ్రీలీలే, దీపికా పదుకొనే, రానా దగ్గుబాటి, రణవీర్ సింగ్ , అలియా భట్ వంటి వారిని ఫాలో అవుతోంది..

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version