Anirudh Vs Thaman: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని సైతం తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన సాంగ్ ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. తమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా మీద హైప్ అయితే పెరిగిపోయింది… ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చూసుకున్న తమన్ హవా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏ పెద్ద సినిమా చూసుకున్న అనిరుధ్ మాత్రమే ఆ సినిమాకి మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ సినిమాకి కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలో దేవిశ్రీప్రసాద్, తమన్ లను దర్శకులు ఎందుకు తీసుకోవడం లేద. అనిరుధ్ మీదనే ఎందుకు అందరు ఆధారపడుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక కింగ్డమ్ సినిమా విజయంలో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ గాని బ్యాగ్రౌండ్ స్కోర్ గాని పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయకపోవడంతో అనిరుధ్ మీద కొంత వరకు నెగెటివిటి అయితే పెరిగిపోయింది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజి సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే అలాగే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనక అద్భుతంగా ఉంటే మాత్రం తమన్ మరోసారి అనిరుధ్ కి పోటీని ఇస్తు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు…లేకపోతే మాత్రం భారీగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో కనక మంచి మ్యూజిక్ ని అందించకపోతే మాత్రం ఆయన కెరియర్ భారీగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ను బట్టి ప్రతి ఒక్కరు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యా గ్రౌండ్ స్కోర్ ఒకటి బాగుంటే సినిమా రిజల్ట్ అనేది మారిపోతోంది. కాబట్టి తమన్ ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ మీద ఇంకాస్త ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇక ఇప్పుడు రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా విషయంలో కూడా అనిరుధ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలైతే చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కనక ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటే ఈ సినిమా సక్సెస్ అవుతుంది.
అలాగే మూవీ సక్సెస్ అయితే మరోసారి ఆయనే టాప్ పొజిషన్ ను అందుకుంటాడు. కాబట్టి రాబోయే సినిమాల విషయం లో ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తోంది. వీళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…