Pawan Kalyan- Anirudh: ఈమధ్యనే పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని, ఆ క్రేజీ ప్రాజెక్ట్ ని #RRR మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్టు వచ్చిన ఒక వార్త అభిమానులను ఎంతలా ఉర్రూతలూ ఊగించేలా చేసిందో అందరికీ తెలిసిందే..చాలా కాలం నుండి క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ వార్త నింపిన జోష్ మామూలుది కాదు..ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబోతున్నామని..పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తామని ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తెలిపాడు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి..ఇక ఈ క్రేజీ కాంబినేషన్ కి సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ ని తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విటర్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ని ట్యాగ్ చేసి పెద్ద ఎత్తున ట్రెండ్ చేసారు..ఫ్యాన్స్ కోరికని గౌరవిస్తూ ఇటీవలే డైరెక్టర్ సుజిత్ తమిళనాడు కి వెళ్లి అనిరుధ్ ని కలిశాడట.
కానీ అనిరుధ్ ‘ఈ ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేను..ఏమి అనుకోకు’ అని సుజిత్ కి చెప్పాడట..ఎందుకంటే అనిరుధ్ కాల్ షీట్స్ మొత్తం ఒక ఏడాదికి సరిపడా నిండిపోయి ఉన్నది..తమిళ సినిమాలతో పాటుగా ఆయన తెలుగు లో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు..కానీ పవన్ కళ్యాణ్ – సుజిత్ సినిమా జనవరి నుండి షూటింగ్ ప్రారంభించుకోవాల్సి ఉంది..ఆ సమయానికి డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పాడట అనిరుధ్..కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మాకు అనిరుధ్ మాత్రమే కావాలి అంటూ సోషల్ మీడియా లో గోల పెట్టేస్తున్నారు.

మరి మేకర్స్ అనిరుధ్ ని ఎలా అయిన ఒప్పించి తీసుకొస్తారా..లేదా థమన్ ని తీసుకొస్తారా అనేది చూడాలి..గతం లో అనిరుధ్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రానికి మ్యూజిక్ అందించాడు..సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ మ్యూజిక్ పరంగా అనిరుధ్ కి ఎలాంటి రిమార్క్ రాలేదు..అందుకే అనిరుధ్ కోసం అంతలా తపిస్తున్నారు ఫ్యాన్స్.