https://oktelugu.com/

Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాకి సంగీతం అందించనున్న అనిరుద్..రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేసాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

'విశ్వంభర' తర్వాత దసరా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ వ్యవహరించబోతున్నాడని సమాచారం.

Written By: , Updated On : January 31, 2025 / 08:30 PM IST
Follow us on

Megastar Chiranjeevi: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు, ప్రేక్షకులకు పూర్తి స్థాయి విందు భోజనం పెట్టలేదు. మూడు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాలైతే ఉన్నాయి కానీ, వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో, అవి కొరవడింది. కొత్త తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా, మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా, తనని తాను అప్డేట్ చేసుకొని ఆడియన్స్ ని అలరించడం మెగాస్టార్ చిరంజీవి లో ఉన్న ప్రత్యేకత. రీ ఎంట్రీ తర్వాత అవి మిస్ అవుతున్నాయి అనే బాధ అభిమానుల్లో ఉంది. పాన్ ఇండియన్ సబ్జక్ట్స్ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఇంకా ఆయన రొటీన్ కమర్షియల్ సినిమాలు, అదే విధంగా రీమేక్ సినిమాలు చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆలస్యంగా అయినా ఈ విషయాన్నీ పసిగట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే తన తదుపరి చిత్రాలన్నీ నేటి తరం యూత్ ఆడియన్స్ ని ఆకర్షితులను చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు.

ఇప్పటికే ఆయన ‘విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ ఫాంటసీ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రం తో పాటు దసరా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమాని ప్రకటించాడు. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ వ్యవహరించబోతున్నాడని సమాచారం. దాదాపుగా ఆయన ఖరారు అయిపోయినట్టే. మూడు కోట్ల రూపాయిల అడ్వాన్స్ కూడా ఇచ్చి లాక్ చేసుకున్నాడట నిర్మాత నాని. ఈ వార్త విన్న తర్వాత అభిమానులు ఇది కదా అసలు సిసలు మెగాస్టార్ సినిమా అంటే, అన్నయ్య మా ఆవేదనని ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘మెగాస్టార్ గారి అభిమానులు దయచేసి నేను వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూపించబోతున్నాను అని ఆశలు పెట్టుకోవద్దు. నేను అలాంటివేమీ చెయ్యట్లేదు. ఇప్పటి వరకు తెలుగు ప్రజలు ఎప్పుడూ చూడని మెగాస్టార్ ని నేను చూపించబోతున్నాను. అభిమానులు జీవితాంతం గుర్తించుకునేలా ఆయన క్యారక్టర్ ఉంటుంది. మెగాస్టార్ ని ఇంత వయొలెంట్ గా మీరెప్పుడు చూసి ఉండరు’ అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు, అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా కూడా సమాంతరంగా పూర్తి చేయాలనీ ఆలోచిస్తున్నాడు మెగాస్టార్. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యినట్టే. కేవలం VFX కి సంబంధించిన వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థం లోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.