Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాలో టాప్ సీక్రెట్ దాచిన అనిల్ రావిపూడి.. బాలయ్య క్యారెక్టర్ పై భారీ ట్విస్ట్

బాలయ్య ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నారనేది ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా కొన్ని నిమిషాల పాటు పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించనున్నారట.

Written By: Suresh, Updated On : October 17, 2023 11:38 am

Bhagavanth Kesari OTT

Follow us on

Bhagavanth Kesari: భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటిస్తున్నారు అని తెలియగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతుంది. అయినా బాలయ్య ఫ్యాన్సా మజాకా? ఇక ఈ సినిమాతో ఈ సారి మా బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు అభిమానులు. అంతే కాదు రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్లు కూడా పక్కా అనే కానిఫిడెన్స్ తో ఉన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ఈ సినిమాలో ఏ గెటప్ లో కనిపిస్తున్నారో కూడా ముందే చెప్పేశారు అనిల్ రావిపూడి.

బాలయ్య ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నారనేది ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా కొన్ని నిమిషాల పాటు పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించనున్నారట. అంతే కాదు ఇందులో ఎన్నో ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. దీంతో పాటు ట్విస్టులు కూడా చాలా ఉంటాయనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో తీసుకుంటారో తెలిసిందే. కానీ ఈ సినిమా కోసం చాలా తక్కువగానే తీసుకుంటున్నారట. బాలయ్య తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి రీజన్ అయితే తెలియరాలేదు.

భగవంత్ కేసరి సినిమాకు మంచి మంచి థియేటర్లనే కేటాయించారనే టాక్ చక్కర్లు కొడుతుంది. అంటే బాలయ్యకు దసరా పండుగతో తిరుగులేదనే చెప్పాలి. అన్నిప్లాన్ గా జరుగుతున్నా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో అనే టెన్షన్ మాత్రం ఫుల్ గా ఉందట అభిమానుల్లో. అంతే కాదు తొందరలోనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మరింత ఆసక్తి నెలకొందట.