Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…తన సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఇక రీసెంట్ గా ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరోసారి ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇప్పటికి అనిల్ రావిపూడి ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని ఫేక్ అవార్తలైతే వస్తున్నాయి. అనిల్ రావిపూడి దానిమీద రీసెంట్ గా స్పందించాడు. నేను ఇంకా పెన్ను పేపర్ పట్టలేదు. కథ కూడా ఫైనల్ కాలేదు.
ఏ హీరోను ఫిక్స్ అవ్వలేదు అలాంటిది మీరే హీరోని ఫిక్స్ చేసుకొని మీరే ఈ జానర్ లో సినిమా చేస్తున్నాను అనేది రాసేసుకుంటున్నారు. అన్ని కుదిరితే మీరే యాక్షన్ కట్ కూడా చెప్పేసేలా ఉన్నారు అంటూ ఫన్నీగా స్పందించాడు. అలాగే మీరు ఇలాంటి ఉత్సాహాన్ని చూపించడంలో తప్పేమీ లేదు. బట్ అన్ని విషయాలను నేను స్వయంగా వెల్లడిస్తాను అతి త్వరలోనే నా నెక్స్ట్ సినిమాలో నటించే హీరో ఎవరు అనేది నేనే డైరెక్ట్ గా చెప్పేస్తాను.
అప్పటిదాకా కొంచెం వేచి ఉండండి అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మొత్తానికైతే ఈ విషయం మీద స్పందించడం పట్ల అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది…
కానీ ఏ హీరో తో సినిమా చేసిన కూడా హీరో యొక్క మేనరిజమ్స్ ను వాడుకొని సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి మరోసారి అదే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. హీరో ఎవరు అనేది తెలిస్తే వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎంత హైప్ ను క్రియేట్ చేయగలుగుతుంది అనే విషయంలో ఒక క్లారిటి అయితే వస్తుంది…