Anil Ravipudi Best Friend
Anil Ravipudi : ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ యంగ్ దర్శకుడు మాత్రం ఆ పాన్ ఇండియా సినిమాల జోలికి పోకుండా తాను నమ్ముకున్న కథతో లోకల్ గానే ఓ రేంజ్ లో సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. థియేటర్లలో ఈ సినిమాకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అయిన కూడా థియేటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తన కెరియర్ ప్రారంభంలో అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ పదేళ్లు పూర్తి అయ్యింది. ఇక పటాస్ సినిమా నుంచి ఇప్పటివరకు ఈ పదేళ్లలో అనిల్ రావిపూడి ఫ్లాప్ లేకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్3,భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుని ఫ్లాప్ అంటే ఏంటో ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కమెడియన్ సప్తగిరి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. సప్తగిరి బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ తన సినిమాలలో ఎందుకు అవకాశం ఇవ్వలేదు కూడా అనిల్ చెప్పుకొచ్చారు.
సప్తగిరి తనకు ఫోన్ చేసి నీ సినిమాలో ఒక సీన్ రెండు సీన్స్ అయితే నేను చేయను అని అంటారట. సరే రా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ నీకు తగ్గది ఏదైనా దొరికితే చేద్దాంలే అని అనిల్ అన్నారట. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఒకవేళ సప్తగిరి కనుక ఒకటి లేదా రెండు సీన్స్ అయినా పర్లేదు అని ఉంటే తనకోసం ఒక మంచి కామెడీ సీన్స్ చేసే వాడిని అంటూ సరదాగా చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుంచే సప్తగిరి నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తెలిపారు.
Anil Ravipudi Best Friend Sapthagiri
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Anil ravipudi says that star comedian in tollywood my best friend didnt give him a chance in my film
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com