Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు మాత్రమే ఇక్కడ చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఈ విషయంలో 12 సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించిన రాజమౌళి (Rajamouli) మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత స్థానాన్ని అనిల్ రావిపూడి సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడమే దానికి కారణం అని చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమైన ఆయన ఈనెల 22వ తేదీ నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార (Nayanatara) నటిస్తుందంటూ గతంలో అనౌన్స్ అయితే చేశారు. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా నయనతార మీద ఒక ప్రమోషనల్ వీడియోని కూడా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఆమెతో ప్రమోషన్ చేయించి సినిమా స్టార్ట్ అవ్వడం కంటే ముందే సక్సెస్ అయ్యారు… నిజానికి నయనతార ఎంత పెద్ద టాప్ హీరోతో సినిమా చేసినా కూడా తను ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనదు. ముందుగా ప్రొడ్యూసర్స్ కి తను తన కండిషన్స్ చెప్పి అవి ఓకే అయితేనే తను సినిమాకి సైన్ చేస్తుంది… ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న నయనతార భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికి ఆమె ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. తన భర్త అయిన విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు మాత్రమే ఆమె ప్రమోషన్స్ కి హాజరయ్యారు.
Also Read: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?
అంతే తప్ప మిగతా ఏ సినిమాలకు కూడా ఆమె పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. మరి అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఏం చెప్పి ఆమెను ఒప్పించాడో తెలియదు కానీ చెన్నై వెళ్లి మరి ఆమెతో ఒక ప్రమోషనల్ వీడియోని చేయించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ వీడియో చూసిన చిరంజీవి అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి. నయనతార ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ వీడియోలో పాల్గొనలేదు.ఇది చూసిన ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శక నిర్మాతలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు…
వరుస సక్సెస్ ను సాధిస్తున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లను సైతం తన మాటలతో గారడీ చేసి మొత్తానికైతే తను అనుకున్నది రాబట్టుకోగలుగుతాడు. ఈ విషయంలో అనిల్ రావిపూడిని డీ కొట్టే వారు ఎవరు లేరు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి లాంటి సీనియర్ నటితో నటింపజేసి సక్సెస్ ని సాధించాడు.
అంతకు ముందు వరకు ఆమె అసలు సినిమాల్లో నటించానని పట్టుబట్టి కూర్చున్నారు. అలాంటి ఆమెను సైతం సినిమాలోకి తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికే దక్కుతుంది… ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఇప్పుడు నయనతార (Nayanatara) తో చేసిన వీడియో చాలా ఇన్నోవేటివ్ గా ఉండటమే కాకుండా సినిమా షూట్ అప్డేట్ ను తెలియజేస్తూ చేసిన వీడియో కాబట్టి ఈ సినిమాకి విపరీతమైన లైకులైతే వస్తున్నాయి…