Anil Ravipudi next target: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పదో సినిమాని వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమాగా వచ్చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. సంక్రాంతి కానుకకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఈ సంవత్సరం చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచింది. గత సంవత్సరం సంక్రాంతి కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇక ఇప్పుడుమరోసారి వెంకటేష్ తోనే సినిమాను చేస్తుండటం విశేషం… ఇక దర్శకుడిగా తనకి మొదటి అవకాశాన్నిచ్చిన కళ్యాణ్ రామ్ ను సైతం ఇందులో భాగం చేయడం నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు పాన్ ఇండియా బాట పట్టి ముందుకు దూసుకెళ్తుంటే అనిల్ రావిపూడి మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు… ఇక ఇప్పుడు 2027 సంక్రాంతికి సూపర్ సక్సెస్ ని సాధిస్తే వరుసగా మూడు సంక్రాంతులకు బ్లాక్ బస్టర్లను అందించిన దర్శకుడిగా రికార్డును క్రియేట్ చేసినవాడవుతాడు. అలాగే వరుసగా 10 విజయాలను తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు.
Also Read: మోసానికి గురైన డైరెక్టర్ శ్రీను వైట్ల.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు..
ఇప్పుడు తన ముందున్న టార్గెట్ ఒక్కటే ఈ సినిమాని వీలైనంత ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే అనిల్ రావిపూడి తన మార్క్ ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా నవ్విస్తూ భారీ కలెక్షన్స్ కి కొల్లగొడుతున్నాడు.
ఇప్పుడు తను ప్రొడ్యూసర్ల పాలిట బంగారు బాతుగా మారిపోయాడనే చెప్పాలి… ఇక ఈ సినిమా తర్వాత ఆయన నాగార్జునతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఈ సినిమా వర్కౌట్ అయి విజయం సాధిస్తే సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య , వెంకటేష్ , నాగార్జునలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన ఈ జనరేషన్ దర్శకుడు తనే అవుతాడు…