Anil Ravipudi And Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. కమర్షియల్ సినిమాలను సక్సెస్ఫుల్గా డీల్ చేయడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు… కమర్షియల్ సినిమాలో అన్ని మీటర్ మీద కరెక్ట్ గా కొలితేసి కొట్టినట్టుగా ఉండాలి. అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి స్టార్ హీరోలందరు ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను చేస్తున్నప్పటికి అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన మరింత ముందుకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి సీక్వెల్ ను చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జునతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు నాగార్జున చేసిన సక్సెస్ ఫుల్ సినిమానే రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో నాగార్జున అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
‘హలో బ్రదర్’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలను రీమేక్ చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది నాగార్జున అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి మాత్రం నాగార్జున లోని కామెడీ యాంగిల్ ను వాడుకొని తనను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగార్జునకి సైతం సక్సెస్ ని అందించినట్లయితే సీనియర్ హీరోలు అందరికీ సక్సెస్ ని అందించిన ఏకైక దర్శకుడిగా అనిల్ రావిపూడి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఆయన ఇక మీదట ఎవరితో సినిమా చేస్తాడు, ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…