Anil Ravipudi: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు చేస్తున్న సినిమా కోసం ఇప్పుడు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ ఈవెంట్ ను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ ఈవెంట్ లో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికే ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: ‘బ్రో 2’ వచ్చేస్తోంది..సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్ సముద్రఖని..వీడియో వైరల్!
రాజమౌళి తో పాటు మరో చాలా గొప్ప దర్శకుడిని కూడా గొప్ప డైరెక్టర్ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆయన ఎవరు అంటే అనిల్ రావిపూడి కావడం విశేషం… రాజమౌళి అనిల్ రావిపూడి కి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేదు. వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక ప్రస్తుతం రాజమౌళి కంటే కూడా అనిల్ రావిపూడి గ్రేట్ అంటూ ఒక విషయంలో ఆయన్ని పొగుడుతున్నారు. అదేంటి అంటే రాజమౌళి అన్ని సంవత్సరాలపాటు అంత బడ్జెట్ తో సినిమాను చేస్తుంటే అనిల్ రావిపూడి సంవత్సరానికో సినిమా చేసుకుంటూ అలవోకగా భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు.
ఇంతకుముందు ఆయన వెంకటేష్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరి ఆ రేంజ్ బడ్జెట్ తో అంత పెద్ద సక్సెస్ సాధించి అన్ని కోట్ల వసూళ్లను సాధించారు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇక అనూప్ రావిపూడి చాలా తక్కువ రోజుల్లోనే సినిమా చేస్తాడు. అందుకే రాజమౌళి కంటే కూడా ఈ విషయంలో అనిల్ రావిపూడి గ్రేట్ అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…