Anil Ravipudi: ప్రొమోషన్స్ చేసే విషయం లో ఎవడైనా అనిల్ రావిపూడి తర్వాతే అని పతీ సందర్భంగా నిరూపణ అవుతూనే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఆయన ప్రొమోషన్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశాడు. దానిని అందుకోవడం కష్టమని , ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి విడుదలకు ముందు పెద్దగా ప్రొమోషన్స్ చేయలేదు. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లరి తో ఆ సినిమాపై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడేలా చేశాడు . ఇక తాను వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో చేయబోయే మల్టీస్టార్రర్ చిత్రానికి షూటింగ్ మొదలు అవ్వకముందే తన క్రియేటివ్ మైండ్ తో సరికొత్త ఆలోచనలతో ప్రొమోషన్స్ మొదలు పెట్టేశాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ని ఏ విధంగా ప్రకటించాడో మనమంతా చూశాము .
వైజాగ్ బీచ్ ఇసుక లో జీవీ ప్రకాష్ కుమార్ ని కప్పేసి , అతనితో మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడం హిలేరియస్ గా అనిపించింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నేడు ఈ సినిమా జానర్ ని ఆడియన్స్ కి ఆయన పరిచయం చేసిన విధానం చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఆయనకు ఎవరో అభిమానులు కంటెంట్ కింగ్ అని సన్మానం చేసి , కత్తి చేతిలో పెట్టారని, ఈ సినిమాకు అన్ని ఐడియాలు నేనే ఇస్తున్నాను , మీరు కూడా ఎదో ఒకటి ఇవ్వండి అని వెంకటేష్ ని దబాయించడం , అందుకు వెంకటేష్ అనిల్ రావిపూడి చేతిలో కత్తి తీసుకొని , అతని వేలు కోసి , ఆ రక్తం తో అనిల్ రావిపూడి కి వీర తిలకం దిద్దడం , ఆ తర్వాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కూడా అదే పని చేయడం , చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది.
అసలు కామెడీ విషయం లో ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు అనిల్ రావిపూడి కి ఎలా వస్తాయో అర్థం కాదు , అతని లాగా కామెడీ ని పండించే డైరెక్టర్ ప్రస్తుతం ఇండియా లోనే లేదు, వచ్చే సంక్రాంతికి మరో 300 కోట్ల గ్రాసర్ ని కొల్లగొట్టబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనిల్ రావిపూడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా, ఈ జానర్ లో అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. కళ్యాణ్ రామ్ కి కూడా ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని అంటున్నారు. రేపటి నుండే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం
Presenting you all the
‘KATHI LANTI IDEA’ from the crazy gang of #VenkyAnil5 #NKRAR2 ❤️SHOOT BEGINS TOMORROW
SANKRANTHI 2027 Release ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi… pic.twitter.com/ikaWOpiAiw
— Shine Screens (@Shine_Screens) June 21, 2026
