Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను అందించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరితో సినిమాలను చేస్తున్న ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అనిల్ రావిపూడి సినిమాలు కామెడీ ప్రధానంగా సాగుతాయనే విషయం మనందరికి తెలిసిందే. కానీ అనిల్ రావిపూడి తన ఫ్రెండ్స్ అయిన ఇద్దరు నటులను మాత్రం తన సినిమాల్లో తీసుకోవడం లేదు. కారణం ఏదైనా కూడా ఆ నటులకు ఎందుకు తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో మొదట సప్తగిరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి సప్తగిరి ఇద్దరు కెరియర్ స్టార్టింగ్ లో రూమ్మేట్స్ గా ఉన్నారు…మొదట్లో సప్తగిరి కూడా డైరెక్టర్ అవ్వాలని యాక్టర్ అయిన విషయం మనకు తెలిసిందే…మరి సప్తగిరికి తన సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వడం లేదంటూ గతంలో అనిల్ రావిపూడిని అడిగితే సప్తగిరి చాలా టాప్ కమెడియన్ గా ఎదిగిపోయాడు. తనకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తే అది ఫుల్ లెంత్ ఉండాలి.
అలాగే ఆయన ఇమేజ్ కి సరిపడా క్యారెక్టర్ నా సినిమాలో లేదని అందుకే తనకి నా మూవీ లో నటించే అవకాశం రాలేదని చెప్పాడు.ఇక జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభి సైతం రీసెంట్ గా రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి ‘చిరంజీవ’ అనే సినిమా చేశాడు.
ప్రముఖ ఓటిటి సంస్థ అయిన ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం…నిజానికి అనిల్ రావిపూడి అదిరే అభి కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ బయట మామ అని పిలుచుకుంటూ ఉంటారట…
ఈ విషయాన్ని స్వయంగా అదిరే అభి చెప్పడం విశేషం…ఇక అలాంటి అభి కి సైతం అనిల్ తన సినిమాలో నటించే అవకాశమైతే ఇవ్వలేదు. నిజానికి అనిల్ రావిపూడి అటు సప్తగిరి, ఇటు అదిరే అభి ఇద్దరిని కావాలనే పక్కన పెట్టేసారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం వాళ్లకు సరిపడా పాత్రలు రావడం లేదు. అందువల్లే అతను వారిని ఎంకరేజ్ చేయడం లేదు. లేకపోతే ఇప్పటికే వాళ్లను తన సినిమాలో భాగం చేసుకునేవాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…