
బాలీవుడ్ లో సీనియర్ హీరో అనిల్ కపూర్ ది ప్రత్యేక శైలి. ఫ్యామిలీ హీరోగా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే అనిల్ కపూర్ కూడా పూర్తి ఫ్యామిలీ మెన్. ముఖ్యంగా ఆయనకు తన కుమార్తెలు అంటే ప్రాణం. అందుకే, వారి ఇష్టాన్ని ఎప్పుడు కాదు అనలేదు అనిల్. సోనమ్ కపూర్ హీరోయిన్ అయ్యాక, ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటినా, తనను అందరూ హేళన చేస్తోన్నా అనిల్ కపూర్ మాత్రం కూతురు పై ఇష్టంతో ఆమె హీరోయిన్ కెరీర్ కి ఎలాంటి అడ్డు చెప్పలేదు.
కాగా తాజాగా అనిల్ కపూర్ చిన్న కూతురు రియా కపూర్ విషయంలో కూడా అనిల్ కపూర్ తన తండ్రి మనసును ఘనంగా చాటుకున్నారు. తన చిన్న కుమార్తె ప్రేమ పెళ్లి ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. దాంతో రియా కపూర్ పెళ్లి పీటలెక్కనుంది. ఇంతకీ రియా కపూర్ ప్రేమించింది ఎవర్ని అంటే.. కరణ్ బూలానీని. నిజానికి వీరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యహారం నడుస్తోంది.
మొదట్లో పెద్దవాళ్ళు అంగీకరించకపోయినా రియా కపూర్ పట్టుబట్టి పెద్దవాళ్ళను ఒప్పించి తన చిరకాల ప్రియుడిని ఈ రోజు జూహూలోని కపూర్ బంగ్లాలో పెళ్లి చేసుకోబోతుంది. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. పైగా ఈ పెళ్లి వేడుకను మూడు రోజలు పాటు గొప్పగా జరిపించనున్నారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించి వార్తను కపూర్ ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
కాకపోతే, ఈ రోజు అనిల్ కపూర్ ఇంటి వద్ద సందడి నెలకొంది. ఆ సందడికి సంబధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అన్నట్టు రియా కపూర్ నిర్మాత కూడా. ఇక ఆమె ప్రియుడు కరణ్ బూలానీ కూడా నిర్మాతనే. మొత్తానికి ఇద్దరు నిర్మాతలు ఒక్కటవ్వబోతున్నారు అన్నమాట.