https://oktelugu.com/

పెళ్లి పై కస్సుబుస్సులాడుతోన్న ‘ముదురు భామ’ !

‘ఆండ్రియా’ అంటేనే మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. అన్నటికి మించి మంచి నటి.. కాకపోతే హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. పైగా ‘ఆండ్రియా’ మంచి సింగర్ కూడా.. కానీ, అక్కడా ఫెయిలే. నిజానికి కెరీర్ మొదట్లో ఎక్స్ పోజింగ్ అంటేనే నో చెప్పే ‘ఆండ్రియా’.. ఆ తరువాత మాత్రం ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచుతూ పోయింది. వయసు పెరిగేకొద్దీ బెడ్ సీన్స్ లోనూ నటించడం ఆనవాయితీగా పెట్టుకుని.. మొత్తానికి తన ముదురు అందచందాలు అన్నీ ఒకేసారి ఒలకబోస్తూ.. […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 04:55 PM IST
    Follow us on


    ‘ఆండ్రియా’ అంటేనే మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. అన్నటికి మించి మంచి నటి.. కాకపోతే హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. పైగా ‘ఆండ్రియా’ మంచి సింగర్ కూడా.. కానీ, అక్కడా ఫెయిలే. నిజానికి కెరీర్ మొదట్లో ఎక్స్ పోజింగ్ అంటేనే నో చెప్పే ‘ఆండ్రియా’.. ఆ తరువాత మాత్రం ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచుతూ పోయింది. వయసు పెరిగేకొద్దీ బెడ్ సీన్స్ లోనూ నటించడం ఆనవాయితీగా పెట్టుకుని.. మొత్తానికి తన ముదురు అందచందాలు అన్నీ ఒకేసారి ఒలకబోస్తూ.. మొన్నటి వరకూ అడపాదడపా ఛాన్స్ లు అందుకుంటూ ఎలాగోలా ఇంకా కెరీర్ ను నెట్టుకొస్తోంది.

    Also Read: ‘వకీల్ సాబ్’ లీక్.. వైరల్ వీడియోలు

    అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కాబట్టి.. చాలామంది వయసు అయిపోయిన హీరోయిన్లు ఎవర్నో ఒకర్ని చూసుకుని పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. కానీ, కొంతమంది హీరోలు, హీరోయిన్లు మాత్రం సోలో బ్రతుకు సో బెటర్ అంటూ ఇంకా ఒంటరిగానే సాగుతున్నారు. కాకపోతే రోజురోజుకూ ఏజ్ బార్ అవుతుంది కదా.. దాంతో ఇంకా సింగిల్ గా ఉన్న హీరోలు, హీరోయిన్లను “మీ పెళ్లి ఎప్పుడు” అని అడుగుతున్నారట. పాపం ఏమి చెప్పాలో తెలియక కొందరు నవ్వుతూ సమాధానం దాటవేస్తుంటే, కొందరు “త్వరలోనే” అంటూ సైడ్ అయిపోతున్నారు.

    Also Read: హైప్ పెంచేందుకు సూపర్ స్కెచ్ వేసిన బిగ్ బాస్ !

    ఐతే, విచిత్రంగా టాల్ బ్యూటీ ఆండ్రియా మాత్రం ఈ ప్రశ్నకు కస్సుబుస్సులాడుతోంది. “నన్ను అలాంటి ప్రశ్న అస్సలు అడగొద్దు,” అని మీడియా జనాలకు క్లాస్ పీకుతుంది. “సింగల్ గా ఉంటే చాలు బాయ్ ఫ్రెండ్ ఎవరు అనో, పెళ్లి ఎప్పుడనో ప్రశ్నలతోనే మీడియా ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం అర్జెంట్ గా బంద్ చెయ్యాలి అంటుంది. ఇలాంటివి ఈ ముదురు భామకు భలే చికాకు అట’ ఇంతకీ ఆండ్రీకిప్పుడు 35 ఏళ్ళు. ఇంకో నాలుగేళ్లు పోతే.. ఈ ముదురు భామను పెళ్లి గురించి ఎవ్వరూ అడగరు అనుకోండి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్