https://oktelugu.com/

Anchor Suma : సుమ డ్రెస్ పై కామెంట్లు చేసిన రోషన్.. కుమారుడే ఇలా అన్నాడేంటి

తల్లిని కొడుకు అనడంతో సుమ ఊరుకుంటుందా. నా డ్రెస్ మీద మీ నాన్ననే సెటైర్ వేయరు.. నువ్వేంటి రా ఇంటికి రా నీ సంగతి చెబుతా అంటూ స్పందించింది సుమ. ఇక మొత్తం మీద సుమ డ్రెస్ పై తన కుమారుడే కామెంట్లు చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 2, 2024 / 10:33 PM IST

    Anchor Suma

    Follow us on

    Anchor Suma : యాంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చలాకీతనం, అల్లరి, అందం, మాటతనం తో ఎంతో మందిని ఆకట్టుకుంది. తన యాంకరింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకొని తెలుగు పరిశ్రమలో టాప్ యాంకర్ లలో ఒకరిగా నిలుస్తుంది సుమ. కొన్ని దశాబ్దాలుగా యాంకర్ గా కొనసాగుతూనే ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సుమ హోస్ట్ చేయాల్సిందే అన్న చందంగా మారింది. ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది సుమ కనకాల.

    ఈమె లేకుండా ఒక చిన్న ఈవెంట్ కూడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించారు. అయితే ప్రస్తుతం తన కొడుకు రోషన్ కనకాల సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బబుల్ గమ్ అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా హీరోగా తన మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకున్నారు. ఈయన తన ఫస్ట్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పాలి.

    ఇదిలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుమారుడు రోషన్ కూడా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై సుమపై రోషన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమానికి సుమ ప్యాంట్ వేసుకొని కాస్త ట్రెండీ వేర్ లో వచ్చారు. దీంతో రోషన్ ఇక్కడ మా అమ్మ ఉండాలి మీరేమైనా చూశారా అంటూ ఫన్నీగా మాట్లాడారు. పక్కనే ఉన్న అమ్మను చూస్తూ అమ్మా నువ్వునా గుర్తు పట్టలేదు. ప్యాంట్ నీ గెటప్ భలే ఉంది అంటూ సెటైర్లు వేశారు.

    తల్లిని కొడుకు అనడంతో సుమ ఊరుకుంటుందా. నా డ్రెస్ మీద మీ నాన్ననే సెటైర్ వేయరు.. నువ్వేంటి రా ఇంటికి రా నీ సంగతి చెబుతా అంటూ స్పందించింది సుమ. ఇక మొత్తం మీద సుమ డ్రెస్ పై తన కుమారుడే కామెంట్లు చేయడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.